వైరల్ న్యూస్: విద్యార్థుల ఆహారంలో పాము.. అస్వస్థతకు గురైన విద్యార్థులు..

తాజాగా బీహార్ రాష్ట్రంలోనే( Bihar ) ఓ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఉన్న క్యాంటీన్ లో ఉండే ఆహారంలో పాముపిల్ల( Snake ) కలకలం సృష్టించింది.

విద్యార్థులు తినే ఆహారంలో ఓ విషపూరిత పాము పిల్ల కనపడడంతో ఆహారం తిన్న పదిమందికి పైగా విద్యార్థులు( Students ) అసస్ధకు గురై ఆస్పత్రి పాలయ్యారు.

ఇక ఆహారంలో చనిపోయిన పాము పిల్ల కనపడినట్లు స్టూడెంట్స్ తెలిపారు.ఇదివరకు కూడా క్యాంటీన్ లో వండుతున్న వంటకాల విషయంపై కూడా ఫిర్యాదు చేసిన కళాశాల యాజమాన్యం పట్టించుకోలేదని విద్యార్థులు వాపోయారు.

ఈ సంఘటనతో అప్రమత్తమైన అధికారులు అధికారులను దర్యాప్తుకు ఆదేశించారు. """/" / ఈ సంఘటనతో మెస్ రన్ చేస్తున్న ఓనర్ కి జరిమానా విధించారు అధికారులు.

ఈ విషయం సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.బంకాకు కు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ ఇంజినీరింగ్ కళాశాలలో( Engineering College ) ఈ సంఘటన చోటుచేసుకుంది.

ఓ విద్యార్థి చనిపోయిన పాము పిల్ల ఆహారంలో కనిపించిందని తెలిపినట్లు సమాచారం.ఆ విషయాన్ని ఇతర విద్యార్థులకు తెలపగా వారంతా ఆందోళన చేయబడ్డారు.

ఈ ఆందోళనలో భాగంగా విద్యార్థులు పలుమార్లు ఫుడ్ విషయంపై కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసిన గాని వారు అసలు పట్టించుకోవట్లేదని తెలిపారు.

"""/" / రాత్రి సమయంలో భోజనం చేస్తున్న సమయంలో ఓ విద్యార్థికి వడ్డించిన ఆహారంలో( Food ) విషపూరిత పాము కనిపించిందని ఆ సమయానికి కొంతమంది విద్యార్థులు భోజనం చేసి వెళ్లిపోయారని తెలుస్తోంది.

ఆ విషపూరిత ఆహారం తిన్న కొంతమంది విద్యార్థులు ఆరోగ్యం క్షిణించడంతో 15 మంది విద్యార్థులను బంక లోని సదర్ ఆసుపత్రికి తరలించారు.

ఇక చికిత్స అనంతరం విద్యార్థులు అందరిని కళాశాలకు పంపించారు.ఇక ఈ ఘటనకు జిల్లా మెజిస్ట్రేట్ అన్షుల్ కుమార్ అలాగే వివిధ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు కళాశాల చేరుకొని అక్కడ విచారణ చేపట్టారు.

అయితే ఆహారంలో విషపూరిత పామా కాదా అన్నది ఇంకా నిర్ధారణ కాలేదని తెలుస్తుంది.

అయితే ఆహార విషయంలో నాణ్యత లేదని యాజమాన్యానికి జరిమానా విధించారు అధికారులు.ఈ ఘటన తర్వాత విద్యార్థులకు నచ్చచెప్పి ఆహారాన్ని మళ్లీ ఏర్పాటు చేశారు.

దాంతో విద్యార్థులతో పాటు ప్రిన్సిపల్ కూడా కలిసి రాత్రి భోజనం చేశారు.ఇక ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతుంది.

Pawan Kalyan: ప్రకాష్ రాజ్ ఆ విధంగా మాట్లాడాల్సిన పనిలేదు… నాకు మంచి మిత్రుడే: పవన్ కళ్యాణ్