చికెన్ కర్రీలో ఎలుకలు.. రెస్టారెంట్‌లో కస్టమర్‌కు ఊహించని చేదు అనుభవం
TeluguStop.com
ఇటీవల రెస్టారెంట్‌కి( Restaurant ) వెళ్లి తినాలంటేనే భయపడే పరిస్ధితులు ఏర్పడ్డాయి.ఎందుకంటే.
రెస్టారెంట్‌లో మంచి క్వాలిటీతో కూడిన ఫుడ్ లభించడం లేదు.నాసిరకమైన ఫుడ్‌ను కస్టమర్లకు వడ్డిస్తున్నారు.
కాలం చెల్లిన పదార్థాలతో వంటలు చేయడం, ఎక్కువ రోజుల నిల్వ చేసిన పదార్థాలతో వంటలు చేయడం వల్ల వాసన రావడం లాంటికి జరుగుతూ ఉంటాయి.
అలాగే చికెన్, మటన్ లాంటి వాటిని రోజుల కొద్ది ఫ్రిజ్‌లో నిల్వ ఉంచి వాటితో డిషెస్ తయారుచేస్తూ ఉంటారు.
దీంతో రెస్టారెంట్లకు వెళ్లి ఏమైనా తినేముందు రెండు,మూడు సార్లు పరిశీలించుకోవడం మంచిది. """/" /
అయితే తాజాగా మంచి ఆహారం తినేందుకు రెస్టారెంట్‌కు వెళ్లిన ఒక వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది.
రెస్టారెంట్‌లో చికెన్ గ్రేవీ( Chicken Gravy ) ఆర్డర్ చేయగా.అందులో ఎలుక( Rat ) వచ్చింది.
ఎలుక చనిపోయి చికెన్ గ్రేవీలో కనిపించడంతో వెంటనే రెస్టారెంట్ సిబ్బందిని పిలిచి చూపించాడు.
రెస్టారెంట్ సిబ్బందిపై ఒక రేంజ్‌లో విరుచుకుపడ్డాడు.కానీ రెస్టారెంట్ సిబ్బంది ఏమీ మాట్లాడకుండా అలాగే సైలెంట్‌గా ఉండిపోయారు.
తమకేమీ పట్టనట్లుగా సిబ్బంది ఉండటంతో.కస్టమర్‌కు కోపం మరింత పెరిగింది.
దీంతో చికెన్ గ్రేవీలో వచ్చిన ఎలుకను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఈ సందర్భంగా రెస్టారెంట్ పేరును కూడా పోస్ట్‌లో పొందుపర్చాడు. """/" /
ఇండియాలోని రెస్టారెంట్లలో ఫుడ్ అసలు క్వాలిటీగా ఉండదని, చాలా దారుణంగా ఉంటుందని ఫైర్ అయ్యాడు.
తినే ముందు జాగ్రత్తగా ఉండాలని సూచించాడు.దీంతో అతడి పోస్ట్‌పై రెస్టారెంట్ యాజమాన్యం స్పందించింది.
ఇదంతా అబద్దమని.తమ రెస్టారెంట్ పేరును చెడగొట్టడానికే ఇలా చేస్తున్నాడని వాదించింది.
కానీ నెటిజన్లు మాత్రం కస్టమర్‌కే సపోర్ట్ చేశారు.అంత పెద్ద తప్పు చేసిన తర్వాత కూడా మళ్లీ కప్పి పుచ్చుకోవడం ఏంటని రెస్టారెంట్ యాజమాన్యంపై మండిపడుతున్నారు.
అంతర్జాతీయ విద్యార్ధులకు భారత్ శుభవార్త .. కొత్తగా రెండు స్పెషల్ వీసాలు