అపశకునాలు, అశుభాలు జరుగుతున్నాయా? అయితే ఇది తెలుసుకోండి!

హిందూ మతాన్ని అనుసరించే ప్రతి ఇంట్లో ఇంతకు ముందు తరాల వారికి శ్రద్ధ కర్మలను, పిండ ప్రదానాలు చేసేవారు.

ఇలా చేయడం ద్వారా మరణించిన పూర్వీకులకు ఆత్మశాంతి కలిగి స్వర్గం పొందుతారని శాస్త్రం చెబుతోంది.

అయితే వీటిని చేయనట్లయితే ఆ ఇంట్లో ఆందోళనలు, అశుభ కార్యాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంటాయి.

అంటే వారికి పితృ దోషాలు ఉన్నాయిని దీని అర్థం.ఇలాంటి దోషం ఉండటం వల్ల ఇంట్లో ఎలాంటి అశుభ లక్షణాలు కలుగుతాయో తెలుసుకుందాం.

ఇంట్లో ఎంతో శుభ్రంగా, అందంగా ఉన్నప్పటికీ ఎక్కడి నుంచొ దుర్వాసన వస్తుంది.అక్కడ ఏమీ లేకపోయినా బయట నుంచి వచ్చే వాళ్లకు చెడు వాసన వస్తుంది అని చెబుతూ ఉంటారు.

ఇలాంటి వాసన వస్తుంది అంటే దాని అర్థం పితృ దేవతలకు కోపం కలిగించే విషయాలు చేయడం ద్వారా ఇలాంటి సంకేతాలు కలుగుతాయి.

సాధారణంగా భోజనం చేసేటప్పుడు ఆహారంలో వెంట్రుకలు కనిపిస్తూ ఉంటాయి.ఇది పొరపాటున జరిగే విషయమే అయిన కొన్నిసార్లు పదే పదే కనిపిస్తూ ఉంటాయి.

ఇంట్లోనే కాకుండా బయట ఏదైనా హోటల్ కి వెళ్ళినా కూడా అక్కడ అలాగే ఆహారంలో వెంట్రుకలు కనిపిస్తే అది అశుభానికి సంకేతం అని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

చనిపోయిన మన పూర్వీకులు కలలోకి రావడం సహజం.కానీ పదేపదే కలలోకి రావడం వల్ల వారికి తీరని కోరికలు ఏవో మిగిలి ఉన్నాయని సంకేతం.

అలాంటి కోరికలను, ఇష్టమైన వస్తువులను ఇతరులకు దానం చేయడం ద్వారా పూర్వీకులు కలలోకి రారు.

పితృ దోషాలు ఉండడం వల్ల ఇంట్లో ఏ శుభకార్యం తలపెట్టిన జరగకపోవడం, ఎన్ని రోజులకు పెళ్లి సంబంధం కుదరకపోవడం, సంతానం కలగకపోవడం ఇవన్నీ కూడా పితృ దోషాల వల్ల కలిగే అశుభాలు.

కనుక వీటి పరిహారం కోసం పూర్వీకులకు పిండప్రదానం చేయడం ద్వారా వారి ఆత్మకు శాంతి కలిగి మనం అనుకున్న పనులు జరుగుతాయ్.

పవన్ కళ్యాణ్ కి మద్దతుగా రామ్ చరణ్..!!