డీసీఎం కొక్కానికి వేలాడిన వ్యక్తి.. తీవ్ర గాయాలు

విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఓ వ్యక్తి డీసీఎం కొక్కానికి వేలాడుతూ కిలో మీటర్ మేర వెళ్లిన ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

సరుకు రవాణా చేసే ఓ డీసీఎం డ్రైవర్, క్లీనర్ చేసిన నిర్లక్ష్యానికి ఓ ప్రాణం పోయేది.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తరలించి.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.వనస్థలిపురానికి చెందిన వెంకటేశ్ (35) ప్రైవేట్ బస్సు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.

విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నాడు.ఆ సమయంలో సరుకు రవాణా చేసే ఓ డీసీఎం ఆ వైపుగా వెళ్తుంది.

లోడ్ తీసుకుని వెళ్తున్న ఆ డీసీఎం వెనుక ఉన్న తలుపు కొక్కెం ఊడిపోయి ఉంది.

బైక్ పై స్పీడ్ గా వెళ్తున్న వెంకటేశ్ రేయిన్ కోట్ గుండిలు ఊడటంతో గాలికి వెళ్లి డీసీఎం కొక్కెనానికి తగిలింది.

దీంతో బైక్ అదుపు తప్పి పడిపోవడంతో వెంకటేశ్ ఆ డీసీఎం వెనకే ఈడ్చుకుంటు వెళ్లసాగాడు.

కేకలు పెట్టినా వినిపించని రీతిలో డ్రైవర్, క్లీనర్ నిర్లక్ష్యం వహిస్తూ వాహనాన్ని నడపుతున్నారు.

కిలో మీటర్ మేరా ఇడ్చుకుపోవడంతో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి.నాగోల్ చౌరస్తాలో రెయిన్ కోట్ చినిగిపోవడంతో వెంకటేశ్ రోడ్డున పడిపోయాడు.

అప్పటికే గాయాలపాలైన వెంకటేశ్ తలకు, పక్కటెముకలుకు, ఇతర భాగాల్లో గాయాలై రక్తస్రావం వస్తుంది.

స్థానికులు గమనించి అంబులెన్స్ సహకారంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు.

బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు నామినేట్ అయిన భారత సంతతి వ్యక్తి .. ఎవరీ క్రిష్ రావల్?