‘‘ మీ పిల్లలకు కోవిడ్ పాజిటివ్‌ ’’.. యూఎస్‌లో ఫ్లైట్ దిగాక భారతీయ కుటుంబానికి జైపూర్ నుంచి ఫోన్

తల్లిదండ్రులతో కలిసి అమెరికా వెళ్లిన ఇద్దరు చిన్నారులు అక్కడ అడుగుపెట్టిన ఒక రోజు తర్వాత కోవిడ్ పాజిటివ్‌గా తేలారు.

ఇందులో ఆశ్చర్యం ఏముందని మీరు అనుకోవచ్చు.భారత్‌లో విమానం ఎక్కడానికి ముందు నిర్వహించిన పరీక్షల్లో పిల్లలిద్దరికీ కరోనా లక్షణాలు లేవని సర్టిఫికేట్ ఇచ్చారు.

దీని ఆధారంగానే వారిని విమానంలోకి అనుమతించారు.తీరా ఇప్పుడు అమెరికాలో దిగిన తర్వాత వారికి పాజిటివ్‌గా తేలినట్లు ఇండియా నుంచి సమాచారం రావడంతో తల్లిదండ్రులు భయాందోళనలకు గురవుతున్నారు.

వారు అమెరికా వెళ్లిన తర్వాత ఆదివారం ఆర్టీపీసీఆర్ పరీక్ష నివేదిక వచ్చిందని జైపూర్ ఆరోగ్య శాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు.

బాధిత పిల్లల వయసు 8, 6 సంవత్సరాలుగా ఆయన చెప్పారు.అమెరికాకు బయల్దేరడానికి ముందు నలుగురు సభ్యుల వీరి కుటుంబం శనివారం జైపూర్‌లోని ఒక ప్రైవేట్ ల్యాబ్‌లో పరీక్షలకు సంబంధించి నమూనాలను ఇచ్చారు.

ఈ సందర్భంగా కోవిడ్ లక్షణాలు లేవని సర్టిఫికెట్ తీసుకున్నారు.దీని ఆధారంగానే వీరి కుటుంబాన్ని విమానంలోకి అనుమతించారు.

అనంతరం ఢిల్లీ నుంచి ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు వీరి విమానం టేకాఫ్ అయ్యింది.

ఈ వ్యవహారంపై జైపూర్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ నరోత్తమ్ శర్మ స్పందించారు.

వీరు 15 రోజుల క్రితం అమెరికా నుంచి భారత్‌కు వచ్చారని.జైపూర్‌కు చెందిన వీరి కుటుంబం ప్రస్తుతం యూఎస్‌లో నివసిస్తోందని తెలిపారు.

ఇండియాలో వున్న సమయంలో బాధిత కుటుంబం రాజస్థాన్‌లోని వైష్ణోదేవి, బికనీర్ జిల్లాలను సందర్శించింది.

అయితే చిన్నారులకు కరోనా పాజిటివ్‌గా తేలిన నివేదిక ఆదివారం మధ్యాహ్నం తమ కార్యాలయానికి చేరిందని.

అయితే అప్పటికే వారు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి తెల్లవారుజామున 2 గంటలకు అమెరికా బయల్దేరారని నరోత్తమ్ శర్మ వెల్లడించారు.

జైపూర్‌లోని బానీపార్క్ ఏరియాలో నివసించే తమ బంధువులను కలవడానికి ఈ కుటుంబం వచ్చినట్లు శర్మ పేర్కొన్నారు.

నివేదిక వచ్చిన తర్వాత కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం ఒక బృందాన్ని బానీపార్క్ ప్రాంతానికి పంపామని, కానీ అప్పటికే సదరు కుటుంబం అమెరికా వెళ్లిపోయినట్లు తమ బృందానికి స్థానికులు తెలియజేశారని శర్మ చెప్పారు.

కాగా.తగ్గుముఖం పట్టిందనుకున్న కోవిడ్ మహమ్మారి రాజస్థాన్‌లో మళ్లీ విజృంభిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం రాష్ట్రంలో 187 యాక్టీవ్ కేసులు వున్నట్లుగా తెలుస్తోంది.సోమవారం కొత్తగా 12 కేసులు నమోదైతే ఇందులో 12 జైపూర్‌లోనే వెలుగుచూశాయి.

ఆ హావభావాలు చూపెట్టగల నటి ఒక్కరైనా ఉన్నారా ఇప్పుడు ?