మరోసారి వీర లెవెల్లో అదరగొట్టిన డేవిడ్ వార్నర్..!

ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్, ఓపెనర్‌ డేవిడ్ వార్నర్ గురించి మన తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

నిత్యం ఏదో ఒక హీరో సినిమాకు సంబంధించిన ఫోటోలు, వీడియోలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి డేవిడ్ వార్నర్ అక్కటుకుంటున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి.

తాజాగా డేవిడ్ వార్నర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ను అనుకరిస్తూ వినయ విధేయత రామ సినిమాలోని ఫైటింగ్ వీడియో క్లిప్పింగ్‌ కు తన ముఖాన్ని జోడించి అద్భుతంగా స్టార్స్ ఫేస్‌ ని మార్ఫింగ్ చేసి ప్రేక్షకులను అక్కటుకుంటున్నాడు.

ఇందుకు సంబంధించిన వీడియోను డేవిడ్ వార్నర్ తన ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.

దీంతో చెర్రీ అభిమానులు ఒక్కసారిగా లైక్స్, కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.గడచిన సంవత్సరం నుంచి డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉన్న సంగతి అందరికీ విధితమే.

లాక్ డౌన్ సమయంలో ఇంట్లో ఖాళీగా ఉన్న వేళ తన కుటుంబసభ్యులతో కలిసి చేసిన టిక్ టాక్ వీడియోలకు ఎంత ఆదరణ వచ్చిందో అందరికీ తెలిసిన విషయమే.

"""/"/ ఈ తరుణంలో తెలుగు హీరోలు ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ చేసిన సినిమా పాటలు డైలాగులు ప్రదర్శన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఇది ఇలా ఉండగా ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా వార్నర్ మంచి ప్రదర్శన ఇవ్వకపోవడంతో సన్రైజర్స్ టీమ్ వార్నర్ ను కెప్టెన్ గా తొలిగించి కేన్ విలియమ్సన్‌కు సారథ్య బాధ్యతలను అప్పగించారు.

అభిమానికి క్షమాపణ చెప్పిన నాగార్జున.. అసలు ఏం జరిగిందంటే..?