బాహుబలికి పోటీగా ఆస్ట్రేలియా ధీరుడు

టాలీవుడ్‌లో తెరకెక్కిన బాహుబలి చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.

ఈ సినిమాతో ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్‌గా మారిపోయాడు.ఇక బాహుబలి చిత్రం కోసం ప్రభాస్ శారీరకంగా ఎంత కష్టపడ్డాడో అందరికీ తెలిసిందే.

అయితే ఈ సినిమాతో ప్రభాస్ సంపాదించుకున్న క్రేజ్‌ను ఇప్పుడు ఆస్ట్రేలియాకు చెందిన ఓ ధీరుడు సొంతం చేసుకుంటానంటూ చెప్పుకొచ్చాడు.

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇటీవల సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేస్తున్నాడో అందరికీ తెలిసిందే.

ప్రస్తుతం వరుసగా వీడియోలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు.అయితే ఈ క్రమంలో బాహుబలి వేషంలో వార్నర్ ఓ వీడియో చేశాడు.

ఇందులో బాహుబలి గెటప్ వేసిన వార్నర్‌ను చూసి తెలుగు ఆడియెన్స్ అవాక్కయ్యారు.సినిమాలోని ప్రభాస్ గెటప్ కన్నా కూడా వార్నర్ గెటప్ బాగుందని పలువురు కామెంట్ చేశారు.

దీంతో బాహుబలిగా ప్రభాస్ బాగున్నాడా లేక నేను బాగున్నానా అంటూ వార్నర్ సరదాగా ఓ పోల్ నిర్వహించాడు.

కాగా ప్రభాస్‌కే పోటీ ఇచ్చాడంటూ పలువురు వార్నర్‌ను పొగిడేస్తుంటే, చాలా మంది ప్రభాస్‌కే తమ ఓటు అంటూ చెప్పుకొచ్చారు.

ఏదేమైనా సోషల్ మీడియా పుణ్యమా అని వార్నర్ ఇలా తెలుగు ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అవుతుండటంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక వార్నర్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఐపీఎల్‌లో ఆటగాడిగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.