మ్యాచ్ గెలిచి గ్రౌండ్ లో సంబరాలు చేసుకున్న దేవిడ్ వార్నర్.. చల్లారిన ప్రతీకారం..!

తాజాగా హైదరాబాద్ -ఢిల్లీ( SRH Vs DC ) మధ్య జరిగిన మ్యాచ్ డేవిడ్ వార్నర్ కు( David Warner ) ఎంతో స్పెషల్.

తన కెరీర్లో ఈ మ్యాచ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.ఎందుకంటే అవమానకర రీతిలో తనను హైదరాబాద్ జట్టు నుండి సాగనంపిన హైదరాబాద్ ఫ్రాంచైజీ పై ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ వార్నర్ ఎట్టకేలకు ప్రతీకారం తీర్చుకొని, గెలుపు అనంతరం గ్రౌండ్లో ఆకాశమే హద్దుగా సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు.

ఆ సంబరాలను చూస్తుంటే వార్నర్ లోపల అవమానకరపు బాధ ఎంత ఉందో స్పష్టంగా తెలుస్తుంది.

హైదరాబాద్ జట్టుపై గెలవాలన్న కసి ఏ రేంజ్ లో ఉందో ఒక్కసారి డేవిడ్ వార్నర్ సంబరాలు( David Warner Celebrations ) చూస్తే అర్థం అవుతుంది.

గ్రౌండ్లో తన జట్టు సభ్యులతో కలిసి పరిగెత్తుతూ హంగామా చేశాడు. """/" / ఢిల్లీ జట్టు గెలిచింది రెండవ మ్యాచ్ మాత్రమే.

అయినా కూడా లీగ్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలోనే ఉంది.కానీ ఢిల్లీ జట్టు రథసారథి డేవిడ్ వార్నర్ సందడిలో మాత్రం టైటిల్ సాధించామన్న గర్వం కనపడింది.

అంతేకాకుండా వార్నర్ డిఫరెంట్ స్టైల్లో ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు.ఈ సెలబ్రేషన్స్ సంబంధించిన వీడియో వైరల్ కావడంతో క్రికెట్ అభిమానులు సైతం అభినందిస్తున్నారు.

"""/" / అసలు విషయం అందరికీ తెలిసిందే.2016లో హైదరాబాద్ జట్టుకు డేవిడ్ వార్నర్ టైటిల్ సాధించి పెట్టాడు.

ఆ తర్వాత హైదరాబాద్ ఫ్రాంచైజీ కెప్టెన్సీ నుండి వార్నర్ ను తొలగించడంతోపాటు తుది జట్టులో ఆడనీయకుండా చివరకు డ్రింక్స్ మోపించి అవమానించింది.

ఎట్టకేలకు తాను పడ్డ అవమానానికి ప్రతీకారం తీర్చేసుకున్నాడు డేవిడ్ వార్నర్.ఇక తాజాగా జరిగిన మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టులో వార్నర్ (21), మిచెల్ మార్ష్ (25), మనీష్ పాండే (34), అక్షర్ పటేల్ (34) పరుగులతో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేశారు.

145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసి, ఏడు పరుగుల తేడాతో ఓడింది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్ 30, ఆదివారం 2024