భారత్ ను ఉద్దేశించి డేవిడ్ భాయ్ సంచలన వ్యాఖ్యలు..!

కరోనా ప్రస్తుత వేవ్ చాలా రాష్ట్రాల్లో తీవ్ర సమస్యలకు కారణం అవుతోంది.ఒకవైపు రోగులకు చికిత్స అందించడానికి వనరుల కొరత వేధిస్తుంటే, మరోవైపు కరోనాతో చనిపోయిన వారికి అంత్యక్రియలు చేయడానికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లోని చాలా జిల్లాల్లో మృతుల అంత్యక్రియల కోసం బంధువులు గంటల తరబడి వేచిచూడాల్సి వస్తోంది.

ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ రాజధానుల్లో పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోంది.భోపాల్‌ గ్యాస్ లీక్ విషాధం తర్వాత మొదటిసారి అక్కడ, ఇలాంటి పరిస్థితి కనిపిస్తోందని కొన్ని స్థానిక సంస్థలు చెబుతున్నాయి.

శవాల అంతిమ సంస్కారాల కోసం జనాలు గంటలపాటు వేచిచూడాల్సి వస్తోంది.రాజధాని భోపాల్‌లోని భద్భదా ఘాట్ దగ్గరే గురువారం కరోనాతో చనిపోయిన 31 మందికి దహన సంస్కారాల జరిగాయి.

ఇక్కడకు ఇతర కారణాలతో చనిపోయిన వారిని కూడా తీసుకొస్తున్నారు.కానీ, వారికి అంత్యక్రియల కోసం బంధువులు రెండేసి గంటలు వేచిచూడాల్సి వస్తోంది.

భోపాల్లో ఇది కాకుండా వేరే శ్మశానాలు కూడా ఉన్నాయి.వాటి దగ్గరకు ఎక్కువ మందిని పంపించడం లేదు.

ఆక్సిజ‌న్ అంద‌క ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు.అంత్య‌క్రియ‌ల కోసం వెయిటింగ్ కూడా చేస్తున్నారు.

తాజాగా ఇండియాలో క‌రోనా ప‌రిస్థితుల‌పై డేవిడ్ వార్న‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.ఎన్నో అడ్డంకులను దాటుకుని ఆస్ట్రేలియాలోని త‌న ఇంటికి చేరిన‌ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఓ ఇంట‌ర్వ్యూలో సంచ‌ల‌న కామెంట్లు చేశాడు.

ఐపీఎల్ ఆడుతున్న‌ప్పుడు క‌రోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి అంత్య‌క్రియ‌లు నిర్వహించేందుకు కుటుంబ స‌భ్యులు రోడ్ల‌పై లైన్లు క‌ట్టడం చూశానని, నిజంగా దారుణ‌మ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.

అలా వారిని చూశాక‌ రాత్రి నిద్ర ప‌ట్టేది కాద‌ని తెలిపాడు.ఇండియాలో ఆక్సిజన్ అంద‌క ప్రజలు చ‌నిపోయారంటూ చెప్పారు.

ఇలాంటి క‌ష్ట స‌మ‌యంలో ఐపీఎల్‌ను ర‌ద్దు చేసి బీసీసీఐ స‌రైన నిర్ణయం తీసుకుంద‌ని చెప్పాడు.

అయితే ఆట‌గాళ్ల‌మంతా అక్క‌డి నుంచి ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్లిపోతామా అని ఎదురు చూశామ‌ని చెప్పాడు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై 19, శుక్రవారం 2024