ఆస్తి కోసం దారుణం..తండ్రిని బంధించి సజీవ దహనం చేసిన కూతుర్లు..!
TeluguStop.com
పుట్టినప్పటి నుండి పిల్లలను తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచుతూ, అన్ని సౌకర్యాలు కల్పిస్తూ, వివాహం చేసి ఒక ఇంటివారిని చేస్తారు.
అటువంటి తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో పట్టాడు అన్నం పెట్టి, సేవ చేయాల్సిన పిల్లలు కర్కశంగా మారి కన్న తండ్రిని ఆస్తికోసం సజీవం చేసిన ఘటన కామారెడ్డి జిల్లాలోని రాజంపేట మండలంలో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
వివరాల్లోకెళితే రాజంపేటలో కొప్పుల ఆంజనేయులు (70) (Koppula Anjaneyulu) అనే వ్యక్తి జీవనం సాగిస్తున్నాడు.
ఈయనకు ముగ్గురు కూతుర్లు, ఒక కుమారుడు సంతానం.కొడుకు ఈ మధ్యనే వ్యవసాయ పొలంలో ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇక ముగ్గురు కూతుర్లకు పెళ్లి చేశాడు ఆంజనేయులు.కూతుర్లు(Daughters) సరిగ్గా చూసుకోకపోవడంతో రెండో వివాహం చేసుకుని జీవనం సాగిస్తున్నాడు.
"""/" /
రెండవ వివాహం చేసుకున్నప్పటి నుండి తండ్రికి కూతుర్లకు మధ్య ఆస్తి తగాదాలు ఏర్పడ్డాయి.
ఆదివారం చిన్న కుమార్తె కూతురి వివాహ విందు కార్యక్రమం కామారెడ్డి లో జరిగింది.
అదేరోజు మధ్యాహ్నం ముగ్గురు కూతుర్లు కలిసి తండ్రిని (Father) ఇంట్లో బంధించి ఉంచారు.
వివాహ తంతు ముగిశాక ఆదివారం రాత్రి తండ్రి పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు.
మంటల్లో కాలిపోతున్న ఆంజనేయులు కాపాడండి అంటూ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి కాపాడే ప్రయత్నం చేయగా కూతుర్లు కాపాడనీయకుండా అడ్డుకున్నారు.
"""/" /
చుట్టుపక్కల వారంతా పోలీసులకు సమాచారం అందించడంతో, హుటాహుటిన సంఘటన ప్రాంతానికి వచ్చి జేసీబీ సహాయంతో ఇంటిని కూల్చేశారు.
ఆంజనేయులు మృతదేహం తల, మొండెం వేరుగా పడి ఉన్నాయి.వెంటనే పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు.
ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు రోడ్డుపై రాస్తా రోకో నిర్వహించి, పోలీసులు రాత్రికి రాత్రే మృతుదేహాన్ని పోస్టుమార్టం తరలించడానికి కారణం ఏంటి? ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని, కూతుర్లు, మనవడు కలిసి చేసిన ఈ పనికి పోలీసులు కూడా సహకరించారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.