డబ్బు పై ఉన్న వ్యామోహం వల్ల తల్లి చేసిన పనికి బలైన కూతురు.. ?

సమాజంలో మనుషుల మధ్య బంధాలు బలపడటానికి ఒక పటిష్టమైన వ్యవస్దను మన పూర్వికులు ఏర్పాటు చేశారు.

ఇందులో భాగంగా కొన్ని కట్టుబాట్లను ఖచ్చితంగా ఆచరించమని చెప్పారు.కానీ నేడు మనుషులు ఈ కట్టుబాట్లను, ఆచారాలను కాదని విచ్చలవిడితనానికి అలవాటుపడుతున్నారు.

ముఖ్యంగా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాల బురదలో చిక్కుకుపోయి అలమటిస్తున్నారు.

కాగా ఒక మనిషిలో మోహం తీవ్రంగా ప్రకోపిస్తే వ్యామోహం అవుతుంది.ముసలితనం వల్ల శరీరం జీర్ణమైనా వ్యామోహం జీర్ణం కాదు.

తత్ఫలితంగా అత్యంత భయంకరమైన పాపబంధాలు ఏర్పడి మనశ్శాంతి లేకుండా పోతుంది.ప్రస్తుతం లోకంలో కామం అనే మోహం, ఆశ అనే వ్యామోహం మనుషులను శాసిస్తున్నాయి.

ఇకపోతే ఇలాగే డబ్బు ఆశలో పడి వివాహేతర సంబంధం పెట్టుకున్న తల్లి వల్ల కూతురు ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.

స్కూల్లో తోటి అమ్మాయిలు తన తల్లి విషయంలో అనే మాటల వల్ల జీవితంపై విరక్తి చెందిన పూర్ణిమ అనే యువతి ఆత్మహత్య చేసుకోవడం విషాదకరం.

అందుకే తల్లిదండ్రుల ప్రవర్తనే విద్యార్ధులకు మొదటి ప్రేరణ అంటారు పేరెంట్స్ ఒక్క సారి ఆలోచించండి.

మీరు చేసే తప్పులు మీ పిల్లల జీవితాలకు ఎలా గొడ్డలిపెట్టులా మారుతున్నాయో.

న్యూట్రల్ ఓటర్లు జగన్ వైపేనా.. ఆ పనులు చేయడమే జగన్ కు ప్లస్ అవుతోందా?