తొలి జీతం తల్లికి పంపబోయి వేరొకరి ఖాతాలో జమ.. యువతి ఏడుపు

కనిపెంచిన తల్లిదండ్రులకు చాలా మంది యువతీ యువకులు ఏదో ఒకటి చేయాలనుకుంటారు.ముఖ్యంగా ఉద్యోగం సాధించగానే తమ తొలి జీతం వారికి ఇచ్చి, వారి కళ్లలో ఆనందాన్ని చూస్తారు.

ఇదే తరహాలో మలేషియాకు చెందిన యువతి తన జీతాన్ని తల్లికి పంపించాలని, ఆమెను సర్‌ప్రైజ్ చేయాలని అనుకుంది.

అయితే పొరపాటున వేరే వ్యక్తి ఖాతాలో వేసేసింది.అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు చెబుతూ కన్నీటి పర్యంతం అయింది.

ఆమె వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఫహదా బిస్టారి అనే అమ్మాయి ఇటీవల తన మొదటి జీతం అనుకోకుండా వేరే వ్యక్తికి పంపింది.

తనకు మొదటి జీతం రాగానే తన తల్లికి ఆ డబ్బు ఇవ్వాలనుకున్నట్లు ఆమె చెప్పింది.

అయితే డబ్బులు పంపేటప్పుడు పొరపాటున వేరే వారి ఖాతాలో దానిని డిపాజిట్ చేసినట్లు తెలిపింది.

అయితే తన జీతం మొత్తం వేరే వ్యక్తి ఖాతాకు వెళ్లిపోయిన విషయం తనకు తెలియదని పేర్కొంది.

తన తల్లికి డబ్బులు అందాయో లేదోనని అడగగానే తల్లి చెప్పిన విషయంతో షాక్ తిన్నట్లు చెప్పింది.

అసలు ఏమైందోనని ఖాతాను పరిశీలించగానే తప్పుగా వేరే వ్యక్తికి పంపించినట్లు గమనించినట్లు తెలిపింది.

దీంతో తాను డబ్బులు పంపిన వ్యక్తికి ఫోన్ చేసి, పొరపాటుగా తన జీతం పంపేశానని తెలిపింది.

తనకు తన డబ్బులు తిరిగిచ్చేయాలని, తన తల్లికి తన మొదటి జీతాన్ని ఇచ్చి సంతోష పరచాలని అనుకున్నట్లు పేర్కొంది.

అయితే అవతలి వ్యక్తి ఆ డబ్బు మర్చిపోమన్నాడని, విరాళం ఇచ్చానని భావించమని బదులిచ్చాడని తెలిపింది.

దీంతో తాను ఒక్కసారిగా కంగుతిన్నట్లు పేర్కొంది.అయితే అతడు ఆ వ్యాఖ్యలు సరదాగా అన్నట్లు వివరించింది.

తన డబ్బులు తిరిగి తనకు పంపించేసినట్లు తెలిపింది.తన బాధను టిక్‌టాక్‌ వీడియో చేసి, నెట్టింట పెట్టగా అది విపరీతంగా వైరల్ అవుతోంది.

ఆ విషయంలో అమ్మాయిలకు హ్యాట్సాఫ్… విశ్వక్ సేన్ కామెంట్స్ వైరల్!