నిజమే ఆ సినీ కవి అన్నది నిజంగానే మనషుల్లో మానవత్వం మాయమైపోతోంది మానవత్వం మరిచి క్రూర మృగాల్లా ప్రవర్తిస్తున్నారు కొందరు నవమాసాలు మోసి కనిపెంచిన తల్లిదండ్రులను కనికరం లేకుండా తమ చేతులతోనే కాటికి పంపుతున్నారు.
ఆస్తి తగాదాలతో కొందరు, మద్యానికి బానిసై మరికొందరు, ప్రేమ మోజులో పడి ఇంకొందరు అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు.
ఆమెకు పదహారేళ్లు డిగ్రీ చదువుతోంది ఆమె తల్లిదండ్రులు రజిత, శ్రీనివాస్‌రెడ్డి.తండ్రి లారీ డ్రైవర్ కాగా, తల్లి చిట్టీల వ్యాపారం చేస్తుంది.
రజిత, శ్రీనివాస్ దంపతులకు కీర్తి ఒక్కగానొక్క కూతురు కావడంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు.అందరి పిల్లల్లాగే కీర్తిని అమెరికా పంపాలని కలలు కంటున్నారు.
ఇక కీర్తి రోజు కాలేజీకి వెళ్లి వస్తోంది.కాలేజీ వయసు కదా పదహారేళ్లకే ప్రేమలో పడిపోయింది.
ప్రియుడితో ఆమె ప్రేమ మల్లెచెట్టు పందిరిలా విరుచుకుంది.ప్రియుడు బాల్‌రెడ్డితో తియ్యని మాటలు.
కలలు కంటూ కాలక్షేపం చేస్తుంది.ఇద్దరు కలిసి అన్యోన్యంగా ఉంటున్నారు.
ఎలాంటి సమస్య వచ్చినా తల్లిదండ్రుల కంటే ముందు ప్రియుడితో పంచుకునేది.మనసు విప్పి మాట్లాడేది.
తనకు ప్రియుడే కాదు.అతడు ఓ మార్గదర్శిలా కనబడ్డాడు ఆమెకు.
"""/"/మనసులు కలిసిన ఈ ప్రేమికులు శారీరకంగా కూడా దగ్గరయ్యారు.కీర్తి గర్భం దాల్చింది.
ఆ సమయంలో ప్రియుడు బెంగళూరులో ఉన్నాడు.ఏం చేయాలో తెలియని అయోమయంలో కీర్తి పడిపోయింది.
తాను ముద్దుగా అన్న అని పిలిచే శశికుమార్‌కు తాను గర్భం దాల్చినట్లు చెప్పింది.
గర్భం ఎలా తీయించుకోవాలని ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసింది.ఈ లోపే శశి తన ఇంటికి ల్యాబ్ వారిని తీసుకొచ్చి టెస్ట్ చేయిస్తే నాలుగు నెలల గర్భవతి అని తేలింది.
"""/"/బాల్‌రెడ్డి కూడా బెంగళూరు నుంచి హైదరాబాద్‌లో దిగాడు.ఇక శశికుమార్ సాయంతో కీర్తి, బాల్‌రెడ్డి కలిసి ఆమన్‌గల్‌కు వెళ్లారు.
అక్కడ ఓ ప్రయివేటు ఆస్పత్రిలో కీర్తి అబార్షన్ చేయించుకుని అక్కడే రెండు రోజులు విశ్రాంతి తీసుకుంది.
ఇక్కడే అసలు ఆట మొదలైంది.కీర్తి అబార్షన్ ఘటనను ఆసరా చేసుకున్న శశికుమార్ ఆమెను బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు.
చేసేదిమీ లేక శశికుమార్‌కు కీర్తి లొంగిపోయింది.వీరిద్దరూ కూడా శారీరకంగా దగ్గయ్యారు.
అయితే బాల్‌రెడ్డి, కీర్తికి పెళ్లి చేయాలని కూడా ఆమె తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు.సీన్ కట్ చేస్తే ఆస్తిపై కన్నేసిన శశికుమార్.
కీర్తితో సన్నిహితంగా ఉన్న వీడియోలను బయటపెడుతానని బెదిరించాడు.కీర్తి, శశి కలిసి మద్యం సేవించేవారు.
రజితకు కూడా మద్యం సేవించే అలవాటు ఉంది.ఎలాగైనా రజిత ఆస్తిని కాజేయ్యాలని ప్లాన్ చేసిన శశి.
ఆమెను చంపేందుకు కీర్తిని ప్రేరేపించాడు.రజితకు ఒక సారి మద్యంలో నిద్రమాత్రలు ఇచ్చి చంపేందుకు ప్రయత్నం చేసినప్పటికీ అది విఫలమైంది.
ఇక రెండోసారి పీకల దాకా మద్యం సేవించిన శశి, కీర్తి.రజిత నివాసముంటున్న ఇంట్లోకి వెళ్లారు.
రజిత కళ్లల్లో కారం చల్లి చేతులు కట్టేసి.నోట్లో గుడ్డలు నొక్కారు.
తల్లి ఛాతీపై కీర్తి కూర్చొని గొంతు నులిమి చంపింది.తల్లిని చంపిన కీర్తి.
శశితో కలిసి రెండు రోజుల పాటు బయటకు వెళ్లింది.ఆమె వెళ్లింది ఎక్కడికో కాదు.
బాల్ రెడ్డి ఇంటికి.ఇక రెండు రోజుల తర్వాత ఇంటికి తిరిగొచ్చారు కీర్తి, శశి.
ఇంట్లో నుంచి దుర్వాసన వస్తోంది.అయితే రజిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది అనేలా చిత్రీకరించేందుకు యత్నించారు.
కానీ అది విఫలైమంది.దీంతో రజిత డెడ్‌బాడీని శశి కారులో రామన్నపేట రైల్వేస్టేషన్ సమీపంలోకి తీసుకెళ్లి అక్కడ పట్టాలపై వదిలేశారు.
ఆ తర్వాత కీర్తి హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్లింది.తనకు ఏమీ తెలియనట్లు అమ్మ కనిపించడం లేదంటూ తండ్రి శ్రీనివాస్‌రెడ్డికి ఫోన్ చేసింది.
వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన కీర్తి.తల్లి రజిత కనిపించడం లేదంటూ హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కీర్తి వైఖరి అనుమానాస్పదంగా ఉండడంతో శ్రీనివాస్‌రెడ్డి, బంధువులు, పోలీసులు నిలదీయడంతో అసలు విషయం వెలుగు చూసింది.
మరి తల్లిని ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందంటే శశికుమార్ చేసిన కుట్ర వల్లే.
10 లక్షల కోసం రజితను చంపాలని కీర్తిని ప్రేరేపించాడు శశి.తల్లిని చంపిన కీర్తి, ప్రియుడు బాల్‌రెడ్డి, శశికుమార్ కటకటలాపాలయ్యారు.
పోలీసుల విచారణలో కీర్తి ముఖంలో ఎలాంటి బెరుకు లేదు.చివరకు జైలుకు వెళ్లే ముందు కీర్తి పోలీసులకు బై బై చెప్తూ మళ్లొస్తా అంటూ వెళ్లింది.