‘దావుద్’ని భయపెట్టిన వ్యక్తి ఇతనే!
TeluguStop.com
భయంకరమైన డాన్ ల గురించి చెప్పుకోవాల్సి వస్తే మనం ఎక్కువగా దావూద్ ఇబ్రహీం పేరును చెబుతూ ఉంటాం.
అయితే దావూద్ ఇబ్రహీంను సైతం భయపెట్టిన భయంకరమైన డాన్ లు ఉన్నారు.ఎడ్యుకేటెడ్ హిందూ డాన్ అని పిలవబడే మన్యా సుర్వే చాలా క్రూరమైన డాన్.
మన్యా సుర్వే ఒకవేళ ఎన్ కౌంటర్ లో చనిపోకపోతే మాత్రం అతను దావూద్ కంటే పెద్ద డాన్ అయి ఉండేవాడని కామెంట్లు వినిపిస్తూ ఉంటాయి.
ముంబై నగరం డాన్ లకు పెట్టింది పేరు.మన్యా సుర్వే ముంబైకు చదువుకోవడం కోసం అక్కడ గన్ కల్చర్ కు అలవాటు పడ్డాడు.
కిర్ట్ కాలేజ్ లో బీఏ చదివిన మన్యా సుర్వే దాదర్ లోని గుండా అయిన భార్గవ్ దగ్గర పనిలో చేరాడు.
1987లో మన్యా సుర్వే ఇద్దరు వ్యక్తులతో కలిసి ఒక వ్యక్తిని మర్డర్ చేసి మూడు సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపాడు.
ఆ తరువాత వేరే జైళ్లకు వెళ్లిన మన్యా సుర్వే రత్నగిరి జైలులో ఉన్న సమయంలో అనారోగ్యం వల్ల ఆస్పత్రిలో చేరి అక్కడినుంచి తప్పించుకుని పారిపోయాడు.
ఆస్పత్రి నుంచి పారిపోయిన మన్యా సుర్వే ముంబైలో ఒక గ్యాంగ్ ను ఏర్పరచుకుని 1990లో 5,700 రూపాయలతో ఉన్న కారును దొంగలించింది.
ఆ తరువాత మన్యా సుర్వే గ్యాంగ్ షేక్ అజీజ్ అనే గ్యాంగ్ స్టర్ గ్రూప్ ను చంపేసింది.
ఆ తరువాత పలు బ్యాంకుల్లో డబ్బును లూటీ చేయించి మన్యా సుర్వే వార్తల్లో నిలిచాడు.
ఒకరోజు మన్యా సుర్వే వడాలోని అంబేద్కర్ నగర్ లో గర్ల్ ఫ్రెండ్ ను కలవడనికి వెళుతున్నాడని తెలిసి నిఘా పెట్టి మన్యా సర్వేను ఎన్ కౌంటర్ చేశారు.
మన్యా సుర్వే ఎన్ కౌంటర్ ను ముంబై నగరంలో తొలి ఎన్ కౌంటర్ గా చెప్పుకుంటారు.
ఖలిస్తాన్ మద్ధతుదారులకు కెనడా కోర్ట్ షాక్ .. పోలీసులకు కీలక ఆదేశాలు