సీనియర్ ఎన్టీఆర్ పై దత్తాత్రేయ వైరల్ కామెంట్స్..!!

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో అంతర్జాతీయ తెలుగు సంబరాల్లో పాల్గొన్నారు.

ముఖ్యఅతిథిగా హాజరైన దత్తాత్రేయ.తెలుగు భాష ప్రాముఖ్యత గురించి ప్రసంగించారు.

మాతృభాష ఎప్పటికీ మర్చిపోకూడదని తాను సంతకం తెలుగులోనే చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు.

ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో తెలుగుజాతికి జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది అని చెప్పుకొచ్చారు.

జరుగుతున్న తెలుగు సంబరాలు తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా అంగరంగ వైభవంగా ఏర్పాట్లు ఉన్నాయ్ అని కొనియాడారు.

ఇదే కార్యక్రమంలో దత్తాత్రేయతో పాటు విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర ఇంకా చాలా మంది ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర మాట్లాడుతూ.ఎవరైనా తెలుగు చంపేయాలి అనుకుంటే దాని కాపాడేందుకు మరో తరం లేగటం గ్యారెంటీ అని అన్నారు.

తెలుగు భాషను తలదన్నే భాష ప్రపంచంలో లేదని కొనియాడారు.అదేవిధంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ కి హైదరాబాదులో శిల్పారామం మించిపోయేలా తెలుగు సంస్కృతి ఉట్టిపడే రీతిలో వేదికను రాష్ట్రంలో నిర్మించాలని త్వరలో లెటర్ రాస్తానని పేర్కొన్నారు.

నిజమైన ప్రేమ బాధను మాత్రమే మిగులుస్తుంది… నాగచైతన్య కామెంట్స్ సమంత గురించేనా?