‘శాకుంతలం’ సెకండ్ సింగిల్ అప్డేట్.. ఎప్పుడంటే?
TeluguStop.com
సౌత్ స్టార్ హీరోయిన్ లలో సమంత రూత్ ప్రభు ఒకరు.ఈమె స్టార్ హీరోల అందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
అయితే ఈమె కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
అయితే వీరి బంధం నాలుగేళ్లు కూడా సాగకుండానే విడాకులు తీసుకున్నారు.ఇక విడాకుల తర్వాత సామ్ మళ్ళీ తన సినీ కెరీర్ కొనసాగిస్తుంది.
పుష్ప ఐటెం సాంగ్ తో ఈమె పాన్ ఇండియా వ్యాప్తంగా పాపులర్ అయ్యింది.
ఈ పాట తర్వాత ఈమెకు మరిన్ని అవకాశాలు వరించాయి.బాలీవుడ్ లో కూడా బడా ప్రాజెక్ట్స్ పై సైన్ చేసింది.
అయితే వరుస అవకాశాలు అందుకుంటూ వాటిని పూర్తి చేస్తున్న సమయంలోనే ఈమె హెల్త్ ప్రాబ్లెమ్ బారిన పడింది.
ఇప్పుడిప్పుడే దీని నుండి కోలుకున్న ఈమె ఈ మధ్యనే షూట్ లో పాల్గొంటుంది.
"""/"/
ఇటీవలే ఈమె నటిస్తున్న బాలీవుడ్ ప్రాజెక్ట్ సీటాడెల్ సెట్స్ లో చేరింది.
ఇది ఇలా ఉండగా ఈమె నటించిన శాకుంతలం సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది.
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పౌరాణిక నేపథ్యంలో తెరకెక్కింది.
ఈ సినిమాను ఫిబ్రవరి 17న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.ఈ క్రమంలోనే మేకర్స్ ప్రమోషన్స్ కూడా గ్రాండ్ గా చేయడానికి సిద్ధం అవుతున్నారు.
"""/"/
తాజాగా మేకర్స్ ఈ సినిమా సెకండ్ సింగిల్ అప్డేట్ ను ఇచ్చారు.
మల్లికా మల్లికా అనే సాంగ్ ను ఇప్పటికే రిలీజ్ చేయగా ఇప్పుడు ఋషివనంలోన అనే మెలోడీని విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించు కున్నారు.
ఈ పాట అన్ని భాషల్లో జనవరి 25న విడుదల కానుంది.ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ డాటర్ అల్లు అర్హ కూడా బాలనటిగా పరిచయం కాబోతుంది.
గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై నీలిమ గుణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
చూడాలి ఈ సినిమాతో సామ్ ఎలాంటి హిట్ అందుకుంటుందో.
హీరో రాజేంద్రప్రసాద్‌తో కాకుండా బాబు మోహన్‌తో సౌందర్య డ్యాన్స్.. ఎందుకో తెలుసా.. ?