వీరయ్య వైజాగ్ లో.. రెడ్డి గారు సీమలో.. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ప్లేస్ ఫిక్స్!

వచ్చే ఏడాది సంక్రాంతి పోటీ రసవత్తరంగా సాగబోతోంది.2023 సంక్రాంతి రేస్ కోసం స్టార్ హీరోలు పోటీ పడుతున్నారు.

ఇక ఈసారి సంక్రాంతికి మన స్టార్ హీరోల్లో ఇద్దరు పోటీకి దిగుతున్న విషయం విదితమే.

సీనియర్ హీరోలు అయిన మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ చాలా ఏళ్ల తర్వాత పోటీ పడబోతున్నారు.

దీంతో ఈ పోటీ ఇప్పుడు మరింత ఆసక్తిగా మారిపోయింది.ప్రెసెంట్ చిరు చేస్తున్న సినిమాల్లో వాల్తేరు వీరయ్య ఒకటి.

ఈ సినిమా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ఇక బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహ రెడ్డి సినిమా చేస్తున్నాడు.

ఈ రెండు సినిమాలు సంక్రాంతి బరిలోనే రాబోతున్నాయి.దీంతో వీరిద్దరి సినిమాలకు థియేటర్స్ దగ్గర కూడా పోటీ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇక ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలు విజయం ఖాయం అనే ధీమాతో పోటీ పడుతున్నారు.

వీరసింహారెడ్డి జనవరి 12న రాబోతుంటే.వాల్తేరు వీరయ్య జనవరి 13న రిలీజ్ కాబోతుంది.

మరి ఎవరికీ ఎంత సత్తా ఉందో ఈసారి తేలిపోనుంది.ఈ క్రమంలోనే రెండు సినిమాలు ప్రొమోషన్స్ లో కూడా స్పీడ్ పెంచేశారు.

వరుసగా సినిమాల నుండి అప్డేట్స్ ఇస్తూ ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీ పెంచుతున్నారు. """/"/ ఇక రిలీజ్ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది అనే చర్చ సాగుతుంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ రెండు సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్ లను ఆంధ్రాలో ప్లాన్ చేస్తున్నారట.

వీరయ్య వైజాగ్ లో.రెడ్డి గారు సీమలో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

జనవరి 8న వాల్తేరు వీరయ్య ఈవెంట్ ను వైజాగ్ లో గ్రాండ్ గా ప్లాన్ చేస్తుండగా.

జనవరి 6న సీమగడ్డ అయిన అనంతపురంలో ప్లాన్ చేస్తున్నట్టు టాక్.మరి ఈ రెండు ఈవెంట్లపై క్లారిటీ రావాల్సి ఉంది.

హెచ్ 1 బీ వీసాలకు ఓకే .. కానీ సంస్కరణలు కావాలంటూ ట్రంప్ వ్యాఖ్యలు