డేటా ఎంట్రీ క్వాలిటీ గా జరగాలి

ప్రజాపాలన సదస్సులలో ప్రతి దరఖాస్తును స్వీకరించాలి అర్హులందరికీ ఆరు గ్యారంటీ లు అందేలా చూడాలి ప్రజా పాలన సదస్సుల పరిశీలనలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజా పాలన నోడల్ అధికారి శ్రీదేవసేన రాజన్న సిరిసిల్ల జిల్లా :సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన వారందరికీ లబ్ధి చేకూర్చేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన సదస్సులలో ప్రజలు అందించే దరఖాస్తుల డేటా ఎంట్రీ క్వాలిటీ గా జరిగేలా చూడాలనీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజా పాలన నోడల్ అధికారి శ్రీదేవసేన అధికారులకు సూచించారు.

శుక్రవారం సాయంత్రం ఆమె వేములవాడ మున్సిపాలిటీ పరిధి 25 వ వార్డులో ఏర్పాటు చేసిన ప్రజా పాలన వార్డు సదస్సును జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ పూజారి గౌతమి తో కలిసి పరిశీలించారు.

సదస్సులో ఏర్పాటు చేసిన కౌంటర్ లు, మౌలిక సదుపాయాలు, వచ్చిన దరఖాస్తుల వివరాలను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి నోడల్ అధికారి కి వివరించారు.

అనంతరం ఆమె దరఖాస్తుదారులతో స్వయంగా మాట్లాడారు.ఆరు గ్యారంటీ లలో ఉన్న స్కీం లు ఏంటని వృద్ధురాలు వజ్రమ్మ ను ప్రశ్నించారు.

ఆమె తడబడకుండా స్కీం ల ప్రయోజనాల గురించి చెప్పడంతో అభినందించారు.దరఖాస్తు ఫారం లో ఏ స్కీం లకు టిక్ చేశారు.

అని పలువురు దరఖాస్తు దారులను వివరాలు అడిగారు.మహాలక్ష్మి,రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్ల, చేయూత పథకాల గురించి ప్రజలకు ఆమె వివరించారు.

అనంతరం వేములవాడ మండలం రుద్రారం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన సదస్సు ను పరిశీలించారు.

దరఖాస్తుల డేటా ఎంట్రీ పై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.డేటా ఎంట్రీ కి పక్కా గా ఏర్పాట్లు చేయాలన్నారు.

ఎక్కువ కంప్యూటర్ లు, మ్యాన్ పవర్ ను పెట్టుకొని వేగంగా పూర్తి అయ్యేలా చూడాలన్నారు.

ఎడిట్ ఆప్షన్ లేనందున డేటా ఎంట్రీ క్వాలిటీ గా జరిగేలా చూడాలన్నారు.ప్రజలు సమర్పించే ప్రతి దరఖాస్తుల వివరాలను ప్రత్యేక రిజిస్టర్ లో పొందుపరుస్తూ ప్రతి అర్జీ దారుడికి తప్పనిసరిగా రసీదు అందించాలని, వారు ఏయే పథకాలకు దరఖాస్తు చేశారనే వివరాల వద్ద రసీదు ఫారంలో టిక్కులు పెట్టాలని తెలిపారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.ప్రజా పాలన గ్రామ , వార్డ్ సదస్సుల ద్వారా అర్హులైన వారి వివరాలు సేకరించి, వారికి లబ్ధిచేకూర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు.

ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినఆరు గ్యారెంటీలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలనీ నోడల్ అధికారి దేవసేన అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధు సూదన్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, తహశీల్దార్ మహేష్, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ఆ విషయంలో పశ్చాత్తాపపడిన రాజ్ తరుణ్.. బిగ్ బాస్ విషయంలో క్లారిటీ ఇదేనంటూ?