దాసరి, కృష్ణంరాజుకు మధ్య పెద్ద గొడవ.. ఆయన్ను తీసేసి కృష్ణకు ఛాన్స్..?

ఓ సినిమా విజయవంతంగా పూర్తి కావాలంటే ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌ అందరూ ఒకే అభిప్రాయం మీద పనిచేస్తుండాలి.

బెస్ట్ ఔట్‌పుట్‌ సాధించే క్రమంలో ఒక్కోసారి ఆర్టిస్టుల, టెక్నీషియన్స్‌ మధ్య విభేదాలు రావడం కామన్.

ఆ మనస్పర్ధలు సినిమా వరకే ఉంటాయి తప్ప పర్సనల్ గా ఎవరూ తీసుకోరు.

కానీ, కొన్ని ఘటనలు మాత్రం సినిమా వాళ్ల మధ్య బాగా దూరాన్ని పెంచేస్తాయి.

దర్శకరత్న దాసరి నారాయణరావు,( Dasari Narayana Rao ) రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు( Krishnam Raju ) విషయంలో అలాంటి ఘటనే జరిగింది.

నిజం చెప్పాలంటే వీరిద్దరూ చాలా మంచి అనుబంధాన్ని షేర్ చేసుకునేవారు.కృష్ణంరాజుని దాసరి ‘అబ్బాయ్‌’ అని ప్రేమగా పిలిస్తే దాసరిని కృష్ణంరాజు ‘నారాయణరావుగారు’ అని మర్యాదగా పిలిచేవారు.

ఇద్దరూ ఆప్యాయంగా మాట్లాడుకునేవారు.ఇంత మంచిగా ఉన్న వారి మధ్య ‘సీతారాములు’ సినిమా( Seetha Ramulu Movie ) చిచ్చు పెట్టింది.

ఈ మూవీ షూటింగ్‌ సమయంలో ఇద్దరూ ఓ విషయంలో గొడవపడ్డారు.చివరికి ఈ సినిమా చేసేది లేదంటూ ఇద్దరూ ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.

"""/" / ‘సీతారాములు’ సినిమా షూటింగ్ జరుపుకుంటున్న సమయంలోనే ‘బండోడు గుండమ్మ’ మూవీ( Bandodu Gundamma Movie ) కూడా ప్రారంభం కావాల్సి ఉంది.

ఇందులో కృష్ణంరాజు హీరో దాసరి దర్శకుడు.అయితే ఈ సినిమా ప్రారంభం కావడానికి ఒక రోజు ముందే వీరిద్దరూ గొడవ పెట్టుకున్నారు.

అదే కోపంతో ఆ మూవీ నిర్మాత జి.వి.

ఎస్‌.రాజును పిలిచి 'కృష్ణంరాజుతో కాకుండా వేరే హీరోతో సినిమా చేద్దాం’ అని చెప్పారు దాసరి.

కృష్ణంరాజు కూడా ఆ సినిమాలో చేసేది లేదు అని స్పష్టం చేశారు.వీరిద్దరి కోపాల మధ్య నిర్మాత బలైపోయారు.

'బండోడు గుండమ్మ’ సినిమా నుంచి కృష్ణంరాజు పూర్తిగా తప్పుకున్నారు అసలు కూడా ఆ మూవీలో వేరే హీరోని ఎదగడం ప్రారంభించారు.

చిన్న హీరోతో సినిమా చేసినా లేదంటే వాయిదా వేసినా తనకు అవమానం జరిగినట్లు అవుతుందని భావించిన దాసరి సూపర్ స్టార్ కృష్ణను( Superstar Krishna ) బతిలాడి ఈ సినిమాలో హీరోగా తీసుకున్నారు.

ఆయన హీరో గానే ఈ మూవీ కంప్లీట్ అయింది. """/" / ఇదిలా ఉంటే దాదాపు సగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ‘సీతారాములు’ సినిమా పరిస్థితే అగమ్య గోచరంగా మారింది.

దాదాపు నాలుగు నెలలు ఆ సినిమా మూలన పడింది.దీనికి నిర్మాత అయిన జయకృష్ణ ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది ఏమో అని భయపడ్డారు.

అలా జరగకూడదని ఆయన దాసరి, కృష్ణంరాజులను ఎంతో బతిలాడారు చివరికి ఆ సినిమా పూర్తి చేయడానికి అంగీకరించారు.

"""/" / 'సీతారాములు’ సినిమాలోని ‘తొలి సంధ్య వేళలో.తొలిపొద్దు పొడుపులో.

’ అనే పాటను కన్యాకుమారిలో షూట్ చేశారు.ఈ లొకేషన్ కు చేరుకోవడానికి దాసరి, కృష్ణంరాజు ఒకే ఫ్లైట్‌లో వచ్చారు కానీ చాలా దూరంగా కూర్చున్నారు, ఇద్దరూ అసలు మాట్లాడుకోలేదు.

విమానం దిగాక హోటల్‌కి కూడా వేరువేరు వాహనాల్లో చేరుకున్నారు.నెక్స్ట్ డే సినిమా టెక్నీషియన్లు ఆర్టిస్టులు అందరూ ఉదయం 4 గంటలకు లొకేషన్‌కి చేరుకున్నారు.

మొదట దాసరి, ఆపై కృష్ణంరాజు వచ్చారు.కృష్ణంరాజు రాకను ముందుగానే తెలుసుకున్న కొందరు దాసరికి తెలియజేశారట.

అప్పుడు దాసరి ‘వస్తే రానీ.ఏం, నేను లేచి అతనికి వెల్కమ్ చెప్పాలా’ అని అరిచేశారట.

అంతలోనే దాసరిని చూసి ‘గుడ్‌మార్నింగ్‌ నారాయణరావుగారూ’ అని కృష్ణంరాజు ఆప్యాయంగా పలకరించారట.దాసరి కూడా ఒక్కసారిగా కూర్చీలో నుంచి పైకి లేచి ‘అబ్బాయ్‌.

ఎలా ఉన్నావ్‌’ అని కృష్ణంరాజుని హగ్‌ చేసుకున్నారట.అలా వారిద్దరి మధ్య మొదలైన గొడవ చివరికి సుఖాంతమైంది.

ఇలా మళ్లీ ఐక్యమయ్యాక వీరిద్దరూ కలిసి ఓ అరడజను సినిమాలు చేశారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్6, ఆదివారం 2024