అక్కడ ‘దసరా’ మాసివ్ రికార్డ్.. అలా రిలీజ్ అవుతున్న ఇండియన్ టాప్ 3 మూవీగా..

స్టార్ హీరోలంతా పాన్ ఇండియా బాట పడుతున్న నేపథ్యంలో టైర్ 2 హీరోలు కూడా మేము ఏ మాత్రం తక్కువ కాదు అనేట్టుగా వారు కూడా పాన్ ఇండియన్ సినిమాలతో రెడీ అవుతున్నారు.

మరి టైర్ 2 హీరోల్లో ఒకరైన న్యాచురల్ స్టార్ నాని కూడా పాన్ ఇండియా సినిమాతో రెడీ అయ్యాడు.

నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ ''దసరా'' (Dasara ).

ఈ సినిమాపై ముందు నుండి మంచి అంచనాలు ఉన్నాయి.రా అండ్ విలేజ్ డ్రామా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాను సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కించారు.

ధరణి పాత్రలో నాని నటిస్తుండగా నాని, కీర్తి ఇద్దరు కూడా డీ గ్లామర్ పాత్రలలో కనిపించనున్నారు.

నాని (Nani) ఊర మాస్ ఇంటెన్స్ లుక్ కు సంబంధించిన పలు పోస్టర్ లను రిలీజ్ చేయగా ఇవన్నీ ఫ్యాన్స్ లో మంచి వైరల్ గా నిలిచాయి.

"""/" / ఇక ఇటీవలే ఈ సినిమా నుండి ట్రైలర్ రిలీజ్ చేసారు.

ఈ టీజర్ ఫ్యాన్స్ ను మరింత ఆకట్టుకుంది.అంతేకాదు ఈ సినిమా కోసం మరింతగా ఎదురు చూసేలా చేయడంలో ఈ ట్రైలర్ బాగా సహాయ పడింది.

ఇక ఈ సినిమా మార్చి 30న భారీ స్థాయిలో పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.

ఈ క్రమంలోనే అన్ని పనులు పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్ధం అయ్యింది.

"""/" / ఇక ఈ సినిమా యూఎస్ లో రికార్డ్ క్రియేట్ చేసినట్టు తెలుస్తుంది.

ఈ సినిమా యూఎస్ లో ఏకంగా 600 లకు పైగా లొకేషన్స్ లో రిలీజ్ అవుతుందట.

ఆల్ టైం టాప్ 3 హైయెస్ట్ లొకేషన్స్ లో రిలీజ్ అవుతున్న సినిమాగా దసరా రికార్డ్ క్రియేట్ చేసిందట.

దీంతో దసరా బిగ్గెస్ట్ రిలీజ్ అనే చెప్పాలి.మరి ఈ రేంజ్ లో రిలీజ్ అంటే ఓపెనింగ్స్ సైతం అదరగొట్టే అవకాశం ఉంది.

కాగా ఈ సినిమాను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా.

సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.

విశాల్ ఆరోగ్యం గురించి రియాక్ట్ అయిన వరలక్ష్మీ శరత్ కుమార్.. అసలేం జరిగిందంటే?