ఈ దసరా విన్నర్ ఎవరంటే?

దసరా పండుగ సెలవులు రావడంతో థియేటర్ల వద్ద పలు సినిమాలు ప్రేక్షకులను సందడి చేశాయి.

ఈ క్రమంలోనే దసరా కానుకగా బరిలోకి దిగిన అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, సిద్ధార్థ్, శర్వానంద్ మహాసముద్రం, శ్రీకాంత్ తనయుడు రోషన్ పెళ్లి సందD సినిమాలు దసరా బరిలో దిగి నువ్వా నేనా అన్నట్టు పోటీ పడ్డాయి.

అయితే దసరా కానుకగా విడుదలైన ఈ సినిమాలు ఏ మేరకు ప్రేక్షకులను సందడి చేశాయి అనే విషయానికి వస్తే.

అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన మహాసముద్రం సినిమాలో రావు రమేష్ అతిథి హైదరి పాత్రలు ఎంతో కీలకంగా మారాయి.

అయితే అజయ్ భూపతి స్క్రీన్ ప్లే ఈ సినిమాకు మైనస్ అయ్యింది.ఈ సినిమా సూపర్ హిట్ అనిపించకపోయినా పరవాలేదని పెంచుకుని సరిపెట్టుకుంది.

అలా ఎన్నో ఆశలతో విడుదలైన మహా సముద్రం సినిమా తీరం తాకలేదనే చెప్పవచ్చు.

ఇకపోతే అఖిల్ పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

ఇందులో అఖిల్ పూజ యాక్టింగ్ సూపర్ అనిపించినప్పటికీ భాస్కర్ స్క్రిప్టులో మాత్రం కొద్దిగా అవకతవకలు ఏర్పడ్డాయి.

అఖిల్ మిగతా సినిమాలతో పోలిస్తే ఈ సినిమా పరవాలేదనిపించిన్నప్పటికీ పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది.

"""/"/ ఇక శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన పెళ్లి సందడి సినిమా ఓపెనింగ్స్ రాలేదని చెప్పవచ్చు.

క్రిటిక్స్ కూడా ఈ సినిమాకు పూర్ రేటింగ్ ఇచ్చారు.మొత్తానికి దసరా బరిలో దిగిన ఈ మూడు సినిమాలలో మహా సముద్రం పరవాలేదనిపించిందని చెప్పవచ్చు.

రజినీ కాంత్ లోకేష్ కనగరాజ్ కూలీ మూవీ లో రజినీకాంత్ పాత్ర ఏంటో తెలుసా..?