మానకొండూరు బీజేపీకి దరువు ఎల్లన్న రాజీనామా
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట - ప్రజా సేవ చేయాలనే లక్ష్యంతో చట్ట సభల్లో వుండాలని ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని ఆశించి, బీజేపీ పార్టీలో చేరి ఎంతో కష్టపడ్డ నన్ను కాదని వారం రోజుల క్రితం వచ్చిన వ్యక్తులకు టికెట్ ఇచ్చి నన్ను రోడ్డు పై వదిలేసి బలి బలిపశువును చేసారని మానకొండూరు బిజెపి నాయకుడు దరువు ఎల్లన్న ఆవేదన వ్యక్తం చేశారు.
శనివారం ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో దరువు ఎల్లన్న మాట్లాడుతూ
ఆనాటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో మానకొండూర్ అసెంబ్లీ బీజేపీ టికెట్ వాగ్దానం తీసుకొని పార్టీలో చేరానని, పార్టీలో చేరినప్పటి నుండి ప్రజా సంగ్రామ యాత్ర ఇలా అనేక కార్యక్రమాలలో పాల్గొని పార్టీకి సేవ చేస్తే నన్ను కాదని వేరే వారికి టికెట్టు కేటాయించడం పై బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
త్వరలోనే తన అనుచరవర్గం అభిప్రాయం తీసుకుని భవిష్యత్ కార్యక్రమం ప్రకటిస్తామని తెలిపారు.
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ…