శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా దుర్గమ్మ దర్శనం
TeluguStop.com
విజయవాడ : శరరన్నవరాత్రుల్లో భాగంగా రెండవ రోజైన మంగళవారంనాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ బాలా త్రిపుర సుందరీదేవిగా సాక్షాత్కరిస్తుంది.
మనసు, బుద్ధి, చిత్తం ఈ దేవి ఆధీనంలో ఉంటాయి.అభయహస్త ముద్రతో ఉండే ఈ తల్లి అనుగ్రహం కోసం ఉపాసకులు బాలార్చన చేస్తారు.
ఈ రోజు రెండు నుండి పదేళ్ళ లోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజించి కొత్త బట్టలు పెడతారు.
అమ్మవారికి ఆకుపచ్చ, ఎరుపు, పుసుపు రంగు చీరలు కట్టి పాయసం, గారెలు నైవేద్యంగా నివేదిస్తారు.