బ్రేకప్ అయినా నేనే కావాలని కోరుకుంటున్నాడు.. నటి షాకింగ్ కామెంట్స్ వైరల్!

సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీల విషయంలో ప్రేమించడం, విడిపోవడం సాధారణంగా జరుగుతుంది.ప్రేమించుకున్న జంటలు విడిపోవడానికి వేర్వేరు కారణాలు ఉంటాయనే సంగతి తెలిసిందే.

కొంతమంది సెలబ్రిటీలు నిశ్చితార్థం తర్వాత కూడా నిశ్చితార్థాన్ని బ్రేక్ చేసుకుని పెళ్లికి దూరంగా ఉన్న సందర్భాలు ఉన్నాయి.

బంధం బ్రేక్ కావడానికి కారణమేంటనే ప్రశ్నకు ఆయా సెలబ్రిటీల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

"""/" / అయితే బ్రేకప్ చెప్పిన వాళ్ల జాబితాలో నేను కూడా ఉన్నానంటూ ప్రముఖ నటి దర్శా గుప్తా( Darsha Gupta ) చెబుతున్నారు.

బుల్లితెర ద్వారా కెరీర్ ను మొదలుపెట్టిన ఈ న్యాచురల్ బ్యూటీ వెండితెర ఆఫర్లను సైతం బాగానే సొంతం చేసుకుంటున్నారు.

కుక్ వి కోమాలి షో ద్వారా పాపులర్ అయిన ఈ బ్యూటీ కెరీర్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఈ బ్యూటీ యాక్టివ్ గా ఉంటున్నారు. """/" / కొత్త మూవీ, బుల్లితెర ఆఫర్ల కోసం సోషల్ మీడియాలో ఫోటోలను పంచుకుంటున్న ఈ బ్యూటీ గ్లామరస్ ఫోటోలతో సోషల్ మీడియా(social Media )ను షేక్ చేస్తున్నారు.

తాజాగా ఒక సందర్భంలో నేను బ్రేకప్ చెప్పిన లవర్ నేను కావాలని ఇప్పటికీ కోరుకుంటున్నాడని ఆమె తెలిపారు.

ప్రేమికుల మధ్య నమ్మకం ఉండాలని ఆ నమ్మకం కోల్పోతే మాత్రం అంతేనని దర్శా గుప్తా వెల్లడించడం గమనార్హం.

"""/" / గుడిసెలో నివాసం ఉన్నా నిజాయితోగా ఉండటం ముఖ్యమని దర్శా గుప్తా పేర్కొన్నారు.

తాను ప్రస్తుతం మరో ప్రియుడి కోసం ఎదురుచూస్తున్నానని దర్శా గుప్తా వెల్లడించారు.దర్శా గుప్తాకు మరో మంచి ప్రియుడు దొరకడం గ్యారంటీ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

దర్శా గుప్తా కెరీర్ పరంగా మరింత బిజీ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.దర్శా గుప్తా రెమ్యునరేషన్( Remuneration ) ప్రస్తుతం పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ నటికి మంచి గుర్తింపు ఉంది.

మరో భారీ ప్రాజెక్టుకు చంద్రబాబు శ్రీకారం .. రాయలసీమకు పండుగే