కళ్ళ కింద నలుపును కాఫీ పౌడర్ తో తరిమికొట్టొచ్చు.. ఎలాగంటే?
TeluguStop.com
నిద్ర సమయాన్ని వృధా చేయడం, మొబైల్ ఫోన్ ను అధికంగా వినియోగించడం, ఒత్తిడి, డిప్రెషన్, పలు రకాల మందుల వాడకం, పోషకాల కొరత తదితర కారణాల వల్ల కొందరికి కళ్ళ కింద నలుపు ఏర్పడుతుంది.
చర్మం ఎంత తెల్లగా మృదువుగా ఉన్నప్పటికీ కళ్ళ కింద నలుపు ఏర్పడటం వల్ల ముఖంలో కల తప్పుతుంది.
ఈ నేపథ్యంలోనే కళ్ళ కింద ఏర్పడ్డ నలుపును వదిలించుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.
తోచిన చిట్కాలు పాటిస్తుంటారు.అయితే అందరి ఇంట్లో ఉండే కాఫీ పౌడర్ తోనే కళ్ళ కింద ఏర్పడిన నలుపును తరిమికొట్టొచ్చు.
అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక మీడియం సైజు బంగాళదుంపను తీసుకుని పీల్ తొలగించి నీటిలో శుభ్రంగా కడిగి సన్నగా తురుముకోవాలి.
ఈ తురుము నుంచి బంగాళదుంప జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి. """/"/
ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ వేసుకోవాలి.
అలాగే రెండు టేబుల్ స్పూన్లు బంగాళదుంప జ్యూస్, రెండు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్, నాలుగు చుక్కలు టీట్రీ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమంలో కాటన్ ప్యాడ్స్ ను ముంచి కళ్ళ కింద పెట్టుకోవాలి.
అర గంట అనంతరం కాటన్ ప్యాడ్స్ ను తొలగించి వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.
"""/"/
రోజుకు రెండు సార్లు ఈ విధంగా చేస్తే కేవలం కొద్ది రోజుల్లోనే కళ్ళ కింద ఏర్పడిన నలుపు మాయం అవుతుంది.
కళ్ళ కింద చర్మం మళ్లీ తెల్లగా, మృదువుగా మారుతుంది.కాబట్టి ఎవరైతే కళ్ళ కింద చర్మం నల్లగా మారిందని బాధపడుతున్నారో వారు తప్పకుండా కాఫీ పౌడర్ తో పైన చెప్పిన రెమెడీని పాటించండి.
తక్కువ సమయంలోనే మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.
డ్రెస్ కూడా మార్చుకోనివ్వరా… పోలీసుల తీరుపై మండిపడిన బన్నీ!