BRS MLA Palla Rajeswar Reddy : కాంగ్రెస్, బీజేపీ మధ్య చీకటి ఒప్పందాలు..: ఎమ్మెల్యే పల్లా

కాంగ్రెస్, బీజేపీపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి( BRS MLA Palla Rajeswar Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్, బీజేపీ ములాఖత్ రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు.గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కోసం కాంగ్రెస్ పని చేసిందన్నారు.

అంతేకాకుండా అనేక మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీజేపీ( Congress BJP ) మధ్య చీకటి ఒప్పందాలు జరిగాయని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.

బీజేపీని సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) పల్లెత్తు మాట అనలేదని మండిపడ్డారు.

పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కల్పించాలని మోదీని అడిగే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదన్నారు.

అలాగే మోదీకి జాతీయ హోదా ఇవ్వాలని భావన లేదని విమర్శించారు.