రివ్యూ : దర్బార్ సూపర్ స్టార్ రేంజ్‌లో ఉందా?
TeluguStop.com
తమిళంలో సూపర్ స్టార్ అయినా కూడా రజినీకాంత్‌కు తెలుగులో కూడా సూపర్ స్టార్ హోదా దక్కుతుంది.
సౌత్ ఇండియా మొత్తంలో రజినీకాంత్ తన సత్తా చాటుతూనే ఉన్నాడు.గత మూడు దశాబ్దాలుగా ఆయన సౌత్‌లో అన్ని భాషల్లో తన సినిమాలతో కుమ్మేస్తున్నాడు.
అయితే ఈమద్య కాస్త జోరు తగ్గినట్లుగా అనిపించింది.మరి ఈ చిత్రంతో మళ్లీ ఆ జోరును కొనసాగించేనా అనేది ఈ రివ్యూలో చూద్దాం.
H3 Class=subheader-styleకథ :/h3p ""img Src="https://telugustop!--com/wp-content/uploads/2020/01/Rajinikanth-Darbar-Movie-Review-and-Rating-దర్బార్-రివ్యూ!--jpg"/ఆధిత్య అరుణాచలం(రజినీకాంత్) ముంబయిలో ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్.
అన్ని సినిమాల్లో మాదిరిగానే ఈ కథలో కూడా స్ట్రిక్ట్‌గా వ్యవహరించే అరుణాచంలను ట్రాన్స్‌ఫర్స్ చేస్తూ ఉంటారు.
ముంబయి నుండి ఢిల్లీకి ట్రాన్స్‌ఫర్ అయిన అరుణాచలం అక్కడ చాలా పెద్ద క్రైమ్‌ను వెలికి తీస్తాడు.
దాని గుట్టు లాగితే చాలా పెద్దల తలకాయలు ఉన్నాయని తెలుసుకుంటాడు.ఆ కేసును ఛేదించే క్రమంలో అరుణాచలం చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇంతకు ఆ సమస్యలు ఏంటీ? విలన్ గ్యాంగ్ ఆటలు కట్టించేందుకు అరుణాచలం బ్యాడ్ కాప్‌గా మారి ఏం చేశాడు అనేది ఈ చిత్రం కథ.
H3 Class=subheader-styleనటీనటుల నటన :/h3p
సూపర్ స్టార్ రజినీకాంత్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఆరు పదుల వయసు దాటిన తర్వాత కూడా రజినీకాంత్ మూడు పదుల వయసు హీరోగానే స్టైల్‌ను కంటిన్యూ చేస్తున్నాడు.
ఆయన మ్యానరిజం మరియు బాడీలాంగ్వేజ్ ఏమాత్రం మారకుండా సినిమాలు చేస్తున్నాడు.ఆయన డైలాగ్ డెలవరీ మరియు ఎక్స్‌ప్రెషన్స్ సూపర్ అని చెప్పుకోవచ్చు.
కాని హీరోయిన్‌తో రొమాన్స్ విషయంలో మాత్రమే కాస్త వెనుకబాటు అని చెప్పుకోక తప్పదు.
ఇక హీరోయిన్‌గా నటించిన నయనతార కూడా లేడీ సూపర్ స్టార్.ఆమె నటన కూడా అద్బుతం.
ఆమెకు కాస్త తక్కువ ప్రాముఖ్యత ఉన్న పాత్ర దక్కినా కూడా తన పాత్రకు పూర్తిగా న్యాయం చేసేలా నటించింది.
ఇక యోగి బాబు కామెడీతో నవ్వించాడు.అతడు రజినీ మరియు నయన్‌ల కాంబో సీన్స్‌లో ఆకట్టుకున్నాడు.
బాలీవుడ్ స్టార్ నటుడు సునీల్ శెట్టి ఆకట్టుకున్నాడు.ఇక మిగిలిన వారు వారి పాత్రల పరిధిలో నటించి ఆకట్టుకున్నారు.
H3 Class=subheader-styleటెక్నికల్ : /h3pఅనిరుథ్ అందించిన సంగీతం తెలుగు ప్రేక్షకులను మెప్పించలేక పోయింది.
ముఖ్యంగా పాటలు స్పీడ్ బ్రేకర్స్ అన్నట్లుగానే ఉన్నాయి.ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్‌లో పర్వాలేదు.
కాని ఎక్కువ సీన్స్‌లో మరీ లౌడ్‌గా అనిపించి భరించలేకుండా ఉంది.ఇక సినిమాటోగ్రఫీ కూడా గందరగోళంగా ఉంది.
ముంబయి అందాలను చక్కగా చూపించవచ్చు.కాని రజినీకాంత్ స్టైల్‌ను చూపించేందుకు సినిమాటోగ్రఫీ పని చేసినట్లుగా ఉంది.
ఎడిటింగ్‌లో లోపాలున్నాయి.దర్శకుడు మురుగదాస్ కథను ఇంకాస్త క్లారిటీగా, స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉండి ఉంటే బాగుండేది.
నిర్మాణాత్మక విలువలు పర్వాలేదు అన్నట్లుగా ఉన్నాయి.h3 Class=subheader-styleవిశ్లేషణ :/h3p ""img Src="https://telugustop!--com/wp-content/uploads/2020/01/Rajinikanth-Darbar-Movie-Review-and-Rating-దర్బార్-రివ్యూ-1!--jpg"/రజినీకాంత్ సినిమా అనగానే గతంలో ఓ రేంజ్‌లో అంచనాలు ఉండేవి.
కాని ఇప్పుడు ఆ అంచనాలు తగ్గాయి.అలాంటప్పుడు రజినీకాంత్ చాలా పవర్ ఫుల్ కథ మరియు ఆకట్టుకునే స్క్రీన్‌ప్లేతో రావాల్సి ఉంటుంది.
కాని మూస కథ మరియు కథనంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.దర్శకుడు మురుగదాస్ ఈ చిత్రంను తన స్థాయిలో చిత్రీకరించలేదు అనిపించింది.
రజినీకాంత్ సూపర్ స్టార్ ఇమేజ్‌కు ఈ చిత్రం సరిపోదని చెప్పక తప్పదు.కథ మరియు స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకా వర్క్ చేయాల్సి ఉంది.
రజినీకాంత్ అభిమానులకు ఎంజాయ్ చేసేందుకు బాగానే ఉంది కాని సామాన్య ప్రేక్షకులు మాత్రం సో సో గానే ఉంది అనుకుంటారు.
H3 Class=subheader-styleప్లస్ పాయింట్స్ :/h3p
రజినీకాంత్,
నయనతార,
కొన్ని కామెడీ సీన్స్
H3 Class=subheader-styleమైనస్ పాయింట్స్ :/h3p
తమిళ ఫ్లేవర్,
సంగీతం,
యాక్షన్ సీన్స్,
కథ, స్క్రీన్‌ప్లే
H3 Class=subheader-styleబోటమ్ లైన్ :/h3p
సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు పండగ కాదు కాని పర్వాలేదు.
H3 Class=subheader-styleరేటింగ్ :/h3p H3 Class=subheader-style2.75/5.
పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన కీర్తి సురేష్… నాని ఇంట్రెస్టింగ్ పోస్ట్!