దర్బార్ ఫస్ట్ డే కలెక్షన్లు.. రజినీయా మజాకా!

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ దర్బార్ భారీ అంచనాల నడుమ నిన్న(జనవరి 9న) ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

ఈ సినిమాతో తలైవా బాక్సాఫీస్ వద్ద మరోసారి తన సత్తా చాటాడు.ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రజినీ యాక్షన్ తలైవా ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చే విధంగా ఉండటంతో ఈ సినిమా వసూళ్ల పరంగా కూడా మంచి కలెక్షన్లు సాధించింది.

తెలుగు రాష్ట్రాల్లో దర్బార్ సినిమాకు మంచి స్పందన లభించడంతో ఈ సినిమాకు తొలిరోజు రూ.

4.41 కోట్లు కలెక్ట్ చేసింది.

డబ్బింగ్ సినిమా అయినా సూపర్ స్టార్ మేనియాకు ఇది నిదర్శనం అని అంటున్నారు సినీ జనం.

అయితే రజినీ స్థాయికి ఇది కాస్త తక్కువే అని చెప్పాలి.ఇకపోతే ఈ కలెక్షన్లు మరింత తగ్గే అవకాశం ఉందని, బాక్సాఫీస్ వద్ద రెండు పెద్ద సినిమాలు వస్తుండటమే దీనికి కారణమని అంటున్నారు సినీ విశ్లేషకులు.

ఏదేమైనా దర్బార్ చిత్రం కొంతమంది తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించగా రజినీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు.

ఇక ఏరియాలవారీగా ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం - 2.03 కోట్లు సీడెడ్ - 0.

66 కోట్లు నెల్లూరు - 0.18 కోట్లు కృష్ణా - 0.

24 కోట్లు గుంటూరు - 0.40 కోట్లు వైజాగ్ - 0.

44 కోట్లు ఈస్ట్ - 0.28 కోట్లు వెస్ట్ - 0.

18 కోట్లు టోటల్ ఏపీ+తెలంగాణ - 4.41 కోట్లు.

ఎన్నికల వేళ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చెప్పిన వైసీపీ..!!