వీడియో: బాబోయ్, ఇదేం స్టంట్.. కొంచెం పట్టు తప్పినా అంతే సంగతులు..!

సాధారణంగా కొందరు వ్యక్తులు చేసే స్టంట్స్ చూస్తేనే మన ఒంట్లో వణుకు పుడుతుంది.

అత్యంత ఎత్తులో ఒక భవనం నుంచి మరొక భవనం పైకి దూకడం, ఆకాశమంత ఎత్తున కొండ పై నుంచి కిందకి దూకటం, వాహనాలతో ప్రమాదకరమైన స్టంట్స్ చేయడం వంటివి చూస్తుంటే మన హార్ట్ బీట్ పెరిగిపోతుంది.

ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వైరల్ అవుతుంటాయి.తాజాగా ఆ తరహా కి చెందిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియో చూస్తే మీరు కూడా షాక్‌కి గురవడం గ్యారెంటీ.ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో వ్యక్తి ఒక అంతస్తు పై నుంచి రెండు గోడల మధ్యలోకి దూకాడు.

అనంతరం ఆ రెండు గోడలకు తన రెండు కాళ్ళను ఆనించి జారుతూ కిందకి వచ్చేసాడు.

ఈ దృశ్యాలన్నీ ఒక వీడియోలో బంధించారు.ఈ వీడియో చూస్తుంటే ఈ సాహసం ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలుగుతుంది.

అలా కలిగినప్పుడు మనలో భయం పెరుగుతుంది.ఎందుకంటే ఈ వీడియోలో ఆ వ్యక్తి చాలా ఎత్తు పైనుంచి దూకాడు.

అలా జంప్ చేసిన ఆ వ్యక్తి రెండు వాల్స్ మధ్య కాళ్లు పెట్టి ఓ ట్రిక్ ద్వారా కిందకు జారాడు.

ఈ క్రమంలో ఏ మాత్రం పట్టు తప్పినా అతను పైనుంచి కింద పడే అవకాశం ఉంది.

ఇలా జరిగితే అతడి ప్రాణాలు పుట్టుక్కున పోయే ప్రమాదముంది.అందుకే ఇలాంటి రిస్కు ఎవరు చేయొద్దని ఈ వీడియో షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ పేజీ అందరినీ కోరింది.

4 రోజుల క్రితం అప్‌లోడ్ చేసిన ఈ వీడియో ఇప్పటికే 2.84 లక్షల లైక్‌లు సంపాదించింది.

దీనికి మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి.దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై 17, బుధవారం 2024