మీరు మోమోస్ ప్రియులా.. నిత్యం తింటారా.. అయితే మీకు ఈ జబ్బులు ఖాయం!

మోమోస్( Momoos ).వీటి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.

ఇటీవల రోజుల్లో స్ట్రీట్ ఫుడ్ లో భారీ జనాదరణ పొందిన వాటిలో మోమోస్ ముందు వరుసలో ఉంటాయి.

ముఖ్యంగా యువతీ యువకులు మోమోస్ ను బాగా ఇష్టంగా తింటున్నారు.మీరు కూడా మోమోస్ ప్రియులా.

నిత్యం వాటిని లాగించేస్తున్నారా.? అయితే డబ్బులు పెట్టి మరీ మీరు జబ్బులను కొని తెచ్చుకుంటున్నట్లే అవుతుంది.

అవును, నిత్యం మోమోస్ తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు.

"""/" / అజినోమోటో, మైదా, ఉడికి ఉడకని కూరగాయలు( Vegetables ) తదితర పదార్థాలు మోమోస్ తయారీలో వాడతారు.

ఇవన్నీ మన ఆరోగ్యానికి హాని కలిగించేవే.నిత్యం మోమోస్ తినడం వల్ల శరీరంలో కేలరీలు లెక్కకు మిక్కిలిగా పెరిగిపోతాయి.

దీని కారణంగా బాడీ వెయిట్( Body Weight ) అదుపు తప్పుతుంది.ఊబకాయం బారిన పడతారు.

మోమోస్ లో వాడే అజినోమోటో క్యాన్సర్ ముప్పును పెంచుతుంది.అలాగే మోమోస్ జీర్ణ వ్యవస్థ పనితీరును( Digestion ) ఘోరంగా దెబ్బ తీస్తాయి.

వీటిని నిత్యం తీసుకోవడం వల్ల మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయి.

మోమోస్ రెగ్యులర్ గా తింటే వాటి తయారీలో వాడే మైదా బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ తప్పేలా చేస్తుంది.

దాంతో మధుమేహం బారిన పడతారు. """/" / అంతేకాదు మోమోస్ తినడం వల్ల అధిక రక్తపోటు తలెత్తుతుంది.

గుండె జబ్బులు( Heart Problems ) వచ్చే ప్రమాదం పెరిగిపోతుంది.ఇక స్ట్రీట్ సైడ్ మోమోస్ తయారీ సమయంలో తగినంత పరిశుభ్రత పాటించరు.

వాటిని తీసుకుంటే జీర్ణకోశ ఇన్ఫెక్షన్లు తలెత్తే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.కాబట్టి ఎంత ఇష్టం ఉన్నా సరే మోమోస్ ను రోజూ తీసుకునే అలవాటు ని వదులుకోండి.

అందులోనూ ప్రస్తుత ఈ వర్షాకాలంలో బయట తయారు చేసే మోమోస్ వంక కూడా చూడదు.

సింగిల్‌ షాట్‌కి దుండగుడు హతం.. ఆ సీక్రెట్ సర్వీస్ స్నైపర్‌పై డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు