ఏసీలో ఎన్ని గంటలు ఉండవచ్చు.. ఎక్కువ సేపు ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయి?
TeluguStop.com
ఇటీవల కాలంలో ఏసీ ( Air Conditioner )అనేది చాలా మందికి నిత్యవసరంగా మారిపోయింది.
వేసవి కాలంలో మాత్రమే ఏసీని ఉపయోగించే రోజులు ఎప్పుడో పోయాయి.ప్రస్తుతం సీజన్ తో పని లేకుండా ప్రతిరోజూ ఏసీ ని ఉపయోగించే వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది.
ఇంట్లో, ఆఫీస్‌లో, కార్ లో.ఇలా ఎక్కడున్నా సరే ఏసీ కావాల్సిందే.
అయితే అసలు ఏసీలో ఎన్ని గంటలు ఉండవచ్చు.? ఎక్కువ సమయం పాటు ఏసీలో ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయి.
? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ఏసీ ఎండ నుంచి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది.
బాడీని కూల్ గా మారుస్తుంది.కానీ పగలు రాత్రి అనే తేడా లేకుండా రోజంతా ఏసీలో ఉండడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
రోజుకు ఐదు గంటలకు మించి ఏసీలో ఉండకూడదని వారు సూచిస్తున్నారు.అంతకంటే ఎక్కువ సేపు ఏసీలో ఉంటే అనేక సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు.
"""/" /
గంటలు తరబడి ఏసీలో ఉండేవారు తరచూ తలనొప్పి( Headache ) సమస్యతో బాధపడతారు.
ఏసీ రూమ్ లో తేమ ఎక్కువగా ఉండటం వల్ల తలనొప్పికి గురవుతారు.అలాగే రోజంతా ఏసీ గదిలోనే గడిపేవారు డీహైడ్రేషన్ బారిన పడే అవకాశాలు అత్యధికంగా ఉంటాయి.
దీని కారణంగా నోరు తడారిపోవడం, అధిక దాహం, నీరసం, అలసట వంటివి తలెత్తుతాయి.
"""/" /
ఏసీలో ఎక్కువ సేపు ఉండడం వల్ల శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి.
ముక్కు మూసుకుపోవడం, గొంతు నొప్పి,( Sore Throat ) గొంతు పొడిబారడం, కళ్ళు మంటలు వంటివి తీవ్రంగా ఇబ్బంది పెడతాయి.
రోజంతా ఏసీలో ఉంటే ఊపిరితిత్తులపై కూడా ప్రభావం పడుతుంది.అంతేకాదు ఏసీలో గంటలు తరబడి గడపడం వల్ల అనేక చర్మ సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ముఖ్యంగా చర్మం పొడిగా మారడం, దురద, చికాకు వంటివి కలుగుతాయి.కాబట్టి వీలైనంతవరకు ఏసీలో తక్కువగా ఉండేందుకు ప్రయత్నించండి.
రోజుకు ఐదు గంటలకు మించి ఏసీలో ఉండవద్దు.
బన్నీని చూసి ఎన్టీఆర్ నేర్చుకోవాలా.. ప్రమోషన్స్ విషయంలో ఫాలో కావాల్సిందేనా?