ఢిల్లీ ఎన్సీఆర్లో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం
TeluguStop.com

ఢిల్లీ ఎన్సీఆర్ లో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో పెరిగిపోయింది.ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై వాయు కాలుష్య తీవ్రత 419 పాయింట్లకు చేరింది.


దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఇవాళ్టి నుంచి బీఎస్ -III పెట్రోల్, బీఎస్ -IV డీజిల్ ఫోర్ వీలర్లపై తాత్కాలిక నిషేధం విధించింది.


ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల కనిష్టానికి పడిపోవడంతో పాటు పొగమంచు పెరగడంతో గాలి నాణ్యత క్షీణించింది.
ఈ మేరకు కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని రాష్ట్రాలను ఆదేశించాలని కేంద్రానికి సీఏక్యూఎమ్ సూచనలు ఇచ్చింది.
ఇప్పటికే పక్క రాష్ట్రాల్లో వ్యవసాయ వ్యర్థాలు తగులబెట్టకుండా ఢిల్లీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
అలాంటి వీడియోల వల్ల ఇబ్బందులు పడుతున్నారు.. అనిల్ రావిపూడి కామెంట్స్ వైరల్!