మిరియాలు ఆరోగ్యానికి మంచివే.. అయినా ఇలా తీసుకుంటే మాత్రం చాలా డేంజర్!

మిరియాలు.(Pepper ).

వీటిని కింగ్ ఆఫ్ స్పైసెస్ అని అంటారు.ఘాటైన రుచిని కలిగి ఉండే మిరియాలను దాదాపు అందరి ఇళ్లలోనూ విరివిరిగా వాడుతుంటారు.

వంటలకు ప్రత్యేకమైన ఫ్లేవర్ ను అందించడంలో మిరియాలు మహా దిట్ట.అలాగే మిరియాల్లో అనేక పోషకాలతో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ పుష్క‌లంగా నిండి ఉంటాయి.

అందువల్ల నిత్యం మిరియాలను తీసుకోమని నిపుణులు చెబుతుంటారు.రెగ్యులర్ డైట్ లో మిరియాలు ఉంటే క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది.

ఇమ్యూనిటీ సిస్టమ్‌ బూస్ట్ అవుతుంది.జలుబు దగ్గు వంటి సమస్యలు దూరం అవుతాయి.

చాలా మంది మలబద్ధకం( Constipation ) సమస్యతో బాధపడుతుంటారు.దీనికి సహజంగానే మిరియాలు చెక్ పెడతాయి.

మిరియాలు తీసుకుంటే మలబద్ధకం పరార్ అవుతుంది.మిరియాల వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.

వెయిట్ లాస్ అవుతారు.అలాగే మిరియాలు మగవాళ్లలో టెస్టోస్టిరాన్ లెవెల్స్ పెంచి సంతాన భాగ్యం కలిగేలా చేస్తాయి.

"""/" / నల్ల మిరియాల వాసన తరచూ పిలిస్తే స్మోకింగ్ అలవాటు కూడా పోతుంద‌ని ప‌లు అధ్యయనాల్లో తేలింది.

అయితే మిరియాలు ఆరోగ్యానికి మంచివే అయినా.అతిగా తీసుకుంటే మాత్రం చాలా డేంజర్ అని చెబుతున్నారు.

ఓవర్ గా మిరియాలను వాడటం వల్ల కడుపు సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.ముఖ్యంగా స్టమక్ అల్సర్, డయేరియా బారిన పడతారు.

"""/" / అలాగే మిరియాలను అతిగా తీసుకుంటే చర్మంలో తేమ తగ్గుతుంది.స్కిన్ డ్రై గా మారి దురద, మంట వంటివి ఏర్పడతాయి.

గర్భిణీలు మరియు పాలు ఇచ్చే తల్లులు మిరియాల‌ను ఎవైడ్ చేయడమే మంచిది.ఎందుకంటే వారిలో మిరియాలు ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తాయి.

ఇక మిరియాలను ఎక్కువగా తీసుకుంటే తీవ్రమైన తలనొప్పి( Headache ), శరీరంలో వేడి పెరగడం వంటివి జరుగుతుంటాయి.

కాబట్టి ఆరోగ్యానికి మంచివే అయినా మిరియాలను పరిమితంగా మాత్రమే తీసుకోండి.

ఎన్టీఆర్ ఫ్యాన్ చేసిన పని తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.. తారక్ ను చూడాలని 300 కిలోమీటర్లు నడిచాడా?