బాబు ప్రాణాల‌కు డేంజ‌రా ? ఆ లేఖ‌లో ఏముందంటే ?

ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీగా చెప్పుకునే టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు, రాజ‌కీయ చాణ‌క్యుడు, సీనియ‌ర్ పొలిటిక‌ల్ లీడ‌ర్ నారా చంద్ర‌బాబు నాయుడుకి ప్ర‌మాదం పొంచి ఉందా ? అంటే అవున‌నే సంకేతాలు వ‌స్తున్నాయి.

తాజాగా బాబు ప్రాణాల‌కు ముప్పు ఉందంటూ టీడీపీ పొలిట్ బ్యూరో మెంబ‌ర్ వ‌ర్ల రామ‌య్య డీజీపీకి లేఖ రాశారు.

అంతేకాదు నిరంత‌రం మంగ‌ళ‌గిరి పార్టీ కార్యాల‌యం వ‌ద్ద సాయుధ బ‌ల‌గాల‌తో బందోబ‌స్తు ఏర్పాటు చేయాల‌ని కోరారు.

ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.ప్ర‌స్తుతం బాబుకు ఎన్ఎస్‌జీ ప్ల‌స్ ప్రొటెక్ష‌న్ ఉంది.

వారంలో ఐదు రోజుల‌పాటు గుంటూరు జిల్లాలోని మంగ‌ళ‌ గిరి పార్టీ ఆఫీసులోనే ఉంటారు.

అలాగే రెండు రోజులు మిన‌హాయించి మిగిలిన వారమంతా గుంటూరు జిల్లాలోని త‌న నివాసంలోనే ఉంటారు.

ఆయ‌న‌ను నిత్యం క‌లిసేందుకు అనేక‌మంది వ‌స్తుంటారు.ఇదివ‌ర‌కే రెండుమూడు సార్లు బాబు ఇంటిపై, టీడీపీ పార్టీ కార్యాల‌యంపై దాడులు జ‌రిగిన ఘ‌ట‌న‌లు  ఉన్నాయ‌ని లేఖ‌లో రాసుకొచ్చార‌ట‌.

ఇప్పుడున్న రాజ‌కీయ ప‌రిస్థితుల దృష్ట్యా బాబు ప్రాణాల‌కు ప్ర‌మాదం పొంచి ఉంద‌ని, ర‌క్ష‌ణ మ‌రింత పెంచాల‌ని లేఖ‌లో పేర్కొన‌డం సంచ‌లనంగా మారింది.

బాబు అడ్డును కొంద‌రు తొల‌గించు కోవాల‌ని కుట్ర చేస్తున్నార‌నే అనుమానాలు సైతం వ్య‌క్తం చేశారు.

అందుకే బాబుకు భ‌ద్ర‌త మ‌రింత పెంచాల‌ని, టీడీపీ కేంద్ర కార్యాల‌యం వ‌ద్ద హైసెక్యూరిటీ ఏర్పాటు చేయాల‌ని లేఖ‌లో కోరాడ‌ట‌.

ఇది ఏపీలో ప్ర‌జెంట్ హాట్ టాపిక్‌గా మారింది. """/" / అయితే బాబుకు ఎవ‌రితో ఇబ్బంది ఉంది ? ఎవ‌రు టార్గెట్ చేస్తున్నారు ? ఆ అవ‌స‌రం ఎవ‌రికి ఉంది ? అనే ప్ర‌శ్న‌లు త‌లెత్తినా.

టీడీపీ మాత్రం సంఘ విద్రోహ‌శ‌క్తుల నుంచి ప్ర‌మాదం ఉందంటూ చెప్పుకొస్తున్నారు.మ‌రి వారు ఎక్క‌డ ఉంటారు ? టీడీపీనే ఎందుకు టార్గెట్ చేశారు ? అనే దానికి గ‌తంలో కూడా జ‌రిగింది క‌దా అని టీడీపీ పేర్కొంటోంది.

అలాగే గ‌తంలో వైసీపీపై టీడీపీ నేత ప‌ట్టాభి చేసిన కామెంట్స్‌తో కొంద‌రు టీడీపీ కార్యాల‌యంపై దాడి చేసిన విష‌యం విధిత‌మే.

ఇటీవ‌ల టీడీపీ నేత‌లు చేసిన కామెంట్స్‌కు యాంటీగా వైసీపీ ఎమ్మెల్యే జోగి ర‌మేష్ ఏకంగా బాబు ఇంటికి వెళ్లేందుకు య‌త్నించాడు.

ప్ర‌స్తుతం ఏపీలో నువ్వానేనా అన్న చందంగా రాజ‌కీయం పులుము కుంది.ఈ క్ర‌మంలో టీడీపీ రాసిన లేఖ సంచ‌ల‌నం రేపుతోంది.

దీనిపై డీజీపీ ఎలా స్పందిస్తారు ? ఏపీ రాజ‌కీయం ఎలాంటి మ‌లుపులు తిరుగుతుందో ? తెలియాలంటే వేచి చూడాల్సిందే.