వేబిడ్జి పక్కనే పొంచి ఉన్న ప్రమాదం

సూర్యాపేట జిల్లా:అనంతగిరి మండలం( Anantha Giri ) బొజ్జగూడెం తండా గ్రామ శివారులోని రైస్ మిల్ ఎదురుగా వేబిడ్జీ పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం మధ్యలో విరిగి ఒక పక్కకు వంగి ఏ క్షణమైనా పడిపోవడానికి సిద్దంగా ఉన్నా దానిని పట్టించుకునే నాథుడే లేడని,విద్యుత్ శాఖ( Electricity Department ) అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిలువెత్తు నిదర్శనంగా ఉందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నాళ్ళ నుండి ఉందో తెలియదు కానీ,రహదారి పక్కనే ఉన్న విద్యుత్ పోల్ విరిగితే ఇనుప కడ్డీ సహాయంతో విత్యుత్ తిగలు అమర్చి వదిలేశారు.

పక్కనే ఉన్న పొలాల రైతులు( Farmers ) ఎప్పుడు కులుతుందోనని భయపడుతున్నారు.కోదాడ నుంచి ఖమ్మం వెళ్ళే ప్రధాన రహదారి కావడంతో నిత్యం వేలాది వాహనాలు వెళ్తుంటాయి, ఏదైనా జరగరానిది జరిగితే పెద్ద నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి వెంటనే విరిగిన స్తంభం మార్చాలని వాహనదారులు,రైతులు కోరుతున్నారు.

గేమ్ ఛేంజర్ అప్డేట్ ఇవ్వాలంటూ చరణ్ రైమ్ ను అడిగిన నెటిజన్… కౌంటర్ ఇచ్చిన ఉపాసన!