అమెరికాలో కరోనా బిగ్గెస్ట్ రికార్డ్..ఒక్కరోజులో..

అమెరికాలో ఊహించని విధంగా కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది.కరోనా తగ్గుముఖం పట్టిందని సంబరాలు చేసుకున్నంత సేపు లేదు అమెరికన్స్ సంతోషం, కేవలం రెండు నెలల వ్యవధిలోనే మరో సారి కరోనా మహమ్మారి తన విశ్వరూపం చూపిస్తోంది.

ఎన్నికల హడావిడి నేపధ్యంలో మీడియా గాని, అలాగే నాయకులు ప్రజలు కరోనాపై పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో దాని ప్రభావాన్ని అంచనా వేయలేకపోయారు.

నాయకులు నిర్వహించే బహిరంగ సభలకు పెద్ద ఎత్తున అమెరికన్స్ పాల్గొనడంతో మహమ్మారి మరింత ఉదృతం అయ్యిందని అంటున్నారు నిపుణులు.

ప్రస్తుతం కరోనా మహమ్మారి అమెరికా వ్యాప్తంగా తీవ్ర రూపం దాల్చడమే కాకుండా వందల సంఖ్యలో ప్రజల ప్రాణాలని హరిస్తోంది.

కేవలం నిన్న ఒక్కరోజులోనే కరోనా కేసుల సంఖ్య 1,66 లక్షల కేసులు నమోదు అవ్వడంతో ఒక్క సారిగా ఉలిక్కిపడ్డారు అమెరికన్స్.

అంతేకాదు నిన్న ఒక్కరోజులోనే 1200 మంది పైగా చనిపోవడం కూడా ఆందోళన కలిగిస్తోంది.

తాజాగా కేసుల సంఖ్యతో పోల్చుకుంటే ఇప్పటివరకూ కరోనా కారణంగా అమెరికా వ్యాప్తంగా నమోదైన కేసులు సంఖ్య 1.

13 కోట్ల కు చేరుకాగా మృతుల సంఖ్య 2.51 లక్షలకు చేరుకుంది.

"""/"/ ప్రస్తుతం కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోవడంతో అమెరికా ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ పరిస్థితుల కారణంగా ఆసుపత్రులపై భారం మరింత పెరిగిపోతుందని లాక్ డౌన్ విధించే పరిస్థితి ప్రస్తుతం నెలకొందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఒక వేళ ప్రభుత్వం లాక్ డౌన్ విధించక పొతే మరో మారు అమెరికా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అంటున్నారు.

అయితే తాజాగా ఏర్పడిన బిడెన్ ప్రభుత్వం ఆయన టీమ్ ప్రస్తుత పరిస్థితులపై సమీక్షలు జరుపుతోందని తెలుస్తోంది.

దూకుడు పెంచిన ఐటీ అధికారులు…దిల్ రాజుతో పాటు మైత్రి పై ఐటి దాడులు?