రన్నింగ్ ట్రైన్‌పై డ్యాన్స్.. ప్రాణాలు పోతాయంటున్న నెటిజన్లు..

సోషల్ మీడియాలో చాలా వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతుంటాయి.కొన్ని వీడియోలను చూసినప్పుడు చాలా భయం వేస్తుంది.

కొంత మంది సోషల్ మీడియాలో లైకుల కోసం ప్రాణాలకు తెగించి వీడియోలు చేస్తుంటారు.

రకరకాల ఫీట్లు, స్టంట్లు చేస్తుంటారు.ఏ మాత్రం పట్టు తప్పినా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి.

ఆ విషయం వీడియోలు చేసే వారికి తెలిసినా, సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు ఏం చేయడానికైనా వెనుకాడడం లేదు.

ప్రస్తుతం ఇదే కోవకు చెందిన ఓ వీడియో బాగా వైరల్ అవుతోంది.రన్నింగ్ ట్రైన్‌పై ఇద్దరు యువకులు ప్రమాదకర స్థితిలో డ్యాన్స్ చేస్తున్న వీడియో చూసి నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.ఇద్దరు కుర్రాళ్లు తమ జీవితాల గురించి ఆలోచించకుండా రైలు పై డ్యాన్స్ చేశారు.

ఇది మాత్రమే కాదు, వారి వీడియోలను రూపొందించే వారిలో మూడవ అబ్బాయి కూడా చేర్చబడ్డాడు.

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వినియోగదారు షేర్ చేశాడు.ఈ వీడియోను అమెరికాలోని న్యూయార్క్ నగరంలో తీసినట్లు తెలుస్తోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే మీరు కూడా షాక్ అవుతారు.

ఇందులో ఇద్దరు కుర్రాళ్లు రైలు పైన నిలబడి డ్యాన్స్ చేస్తూ కనిపించారు.కొన్నిసార్లు మొబైల్ కెమెరా ఈ అబ్బాయి వైపు, కొన్నిసార్లు కెమెరా ఆ అబ్బాయి వైపు తిరుగుతుంది.

"""/"/ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగానే బాగా వైరల్ అవుతోంది.ఎక్కువ మంది నెటిజన్లు ఆ యువకుల తీరును తప్పు పడుతున్నారు.

ఇలాంటి ఫీట్లు చేసేటప్పుడు బాగానే ఉంటుందని, అయితే ఏ మాత్రం ప్రమాదం జరిగినా ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు.

ఇలాంటి పనులు చేసి ప్రాణాలు పోగొట్టుకోవద్దని హితవు పలుకుతూ కామెంట్లు చేస్తున్నారు.మొత్తంగా ఆ యువకులు చేసిన ఈ పని ప్రశంసలు కంటే విమర్శలు ఎక్కువ తీసుకొచ్చింది.

అరటి తొక్కతో ఇలా చేశారంటే మీ స్కిన్ సూపర్ వైట్ గా మారడం ఖాయం!