అద్భుత డ్యాన్స్ కంపోజర్ కు ఆ క్రెడిట్ ఇవ్వకపోవడం నిజంగా దారుణం...
TeluguStop.com
గతంతో పోల్చితే ఇప్పుడు వచ్చే సినిమా.ఆ సినిమాల్లో కథలు.
పాటలు, మాటలు అన్నీ.కలుషితం అయిపోయాయి.
టెక్నికల్ వ్యాల్యూస్ పెరిగాయే తప్ప స్టోరీలు మాత్రం నానాటికి తీసికట్టు అన్నట్లుగా తయారయ్యాయి.
ఒకప్పుడు సినిమా అంటే అద్భుతమైన పాటలు ఉండేవి.అవి ఏండ్ల తరబడి జనాల నోళ్లలో మెదిలేవి.
కానీ ప్రస్తుతం వస్తున్న పాటలు, వాటి డ్యాన్సులు కేవలం బూతు మాటలు, హీరోయిన్ల అంగాంగ ప్రదర్శనలే ఎక్కువ కనిపిస్తున్నాయి.
జనాలను రెచ్చగొట్టే పాటలే అధికం అయ్యాయి.జనాలకు వీనుల విందు కలిగించే పాటలు చాలా అంటే చాలా తగ్గిపోయాయి.
కానీ ఎప్పుడో ఎక్కడో ఒకచోట అలాంటి పాటలకు కనిపిస్తున్నాయి.తాజాగా వచ్చిన శ్యామ్ సింగరాయ్ సినిమాలోనూ ఓ అద్భుత పాటు.
అంతే అద్భుతంగా ఉన్న డ్యాన్సు కనిపించాయి.ఇంతకీ ఆ పాట ఏంటి? దాని కథ ఏంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఈ సినిమాలోని ప్రణవాలయ పాహి పరిపాలయ పరమేశి అనే పాటను సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాశాడు.
ఆయన రాసిన చివరి పాట ఇదే అంటున్నారు సినీ జనాలు.ఈ పాటను అనురాగ్ కులకర్ణి అద్భుతంగా ఆలపించాడు కూడా.
మిక్కిజే మేయర్ చక్కటి సంగీతాన్ని అందించాడు.ఇక ఈ పాటకు సాయి పల్లవి చేసిన డ్యాన్స్ అద్భుతం అని చెప్పుకోవచ్చు.
చూస్తున్నంత సేపు ఎంతో చక్కటి ఫీలింగ్ కలుగుతుంది.అయితే ఈపాటకు అద్భుతంగా డ్యాన్స్ కంపోజ్ చేసిన వారు ఎవరు అనేది మాత్రం బయటకు తెలియలేదు.
"""/"/
వాస్తవానికి ఈ పాటను యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు.ఈ పాటకు సంబంధించి అన్ని వివరాలు పెట్టారు.
ఈ పాటను ఎవరు రాశారు.ఎవరు పాడారు.
దీనికి సంగీతం ఎవరు అందించారు అనే విషయంతో పాటు చాలా విషయాలు వెల్లడించారు.
అయితే ఇంత అద్భుతమైన పాటకు డ్యాన్స్ కంపోజ్ చేసిన మాస్టర్ పేరు మాత్రం పెట్టలేదు.
అయితే ఈ పాటకు డ్యాన్స్ కంపోజ్ చేసిన మాస్టర్ క్రుతి మహేష్ అని తెలిసింది.
ఆమెకు సినిమా యూనిట్ క్రెడిట్ ఇవ్వకపోవడం దారణం అని చెప్పుకోవచ్చు.
నాగ చైతన్య కార్తీక్ వర్మ కాంబోలో వస్తున్న సినిమా జానర్ ఏంటో తెలుసా..?