ఆ హీరో ఏదో అన్నాడని హీరోయిన్ అలిగి సెట్లో నుంచి వెళ్ళిపోయింది....

ఆ హీరో ఏదో అన్నాడని హీరోయిన్ అలిగి సెట్లో నుంచి వెళ్ళిపోయింది….

తెలుగులో దాదాపుగా సీనియర్ నుంచి జూనియర్ వరకు అందరి స్టార్ హీరోల చిత్రాలలో డాన్స్ కొరియోగ్రాఫర్ గా పనిచేసిన ప్రముఖ లేడీ కొరియోగ్రాఫర్ "స్వర్ణ మాస్టర్" గురించి సినీ ప్రేక్షకులకి సుపరిచితమే.

ఆ హీరో ఏదో అన్నాడని హీరోయిన్ అలిగి సెట్లో నుంచి వెళ్ళిపోయింది….

అయితే సినిమా పరిశ్రమలో ఎలాంటి పాటలయినా తన డాన్స్ కంపోజింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడం స్వర్ణ మాస్టార్ ప్రత్యేకత.

ఆ హీరో ఏదో అన్నాడని హీరోయిన్ అలిగి సెట్లో నుంచి వెళ్ళిపోయింది….

కాగా తాజాగా స్వర్ణ మాస్టర్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని తాము చిత్రాల్లో పని చేసేటప్పుడు ఎదుర్కొనే సంఘటనల గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది.

అయితే ఇందులో భాగంగా తాను కొరియోగ్రాఫర్ గా సినిమా పరిశ్రమకు వచ్చిన కొత్తలో పెద్దగా సౌకర్యాలు ఉండేవి కాదని కానీ ప్రస్తుతం మంచి సౌకర్యాలతో పాటు సినిమా అవకాశాలు, అలాగే మహిళల భద్రత కూడా చాలా బాగుందని చెప్పుకొచ్చింది.

అంతేకాక మన హద్దుల్లో మనం ఉంటే ఎలాంటి తప్పిదాలు జరగవని అంతేతప్ప ఇతరుల పట్ల మితిమీరిన చనువు మరియు రాసుకుపూసుకు తిరగడం వంటివి చేయడంవల్ల ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది.

తాను గతంలో పనిచేసిన చిత్రాల్లో కూడా ఓ హీరో అన్న మాటలకు హీరోయిన్ తట్టుకోలేక సినిమా సెట్ నుంచి ఏడ్చుకుంటూ వెళ్లిపోయిందని ఆ తర్వాత దర్శక నిర్మాతలు ఆమెను బుజ్జగించి మళ్లీ తీసుకువచ్చారని ఉదాహరణగా చెప్పుకొచ్చింది.

ఇలాంటి సంఘటనలు తన సినిమా కెరీర్ లో చాలానే చూశానని కానీ తను ఉన్న చోట మాత్రం ఎలాంటి తప్పిదం గాని లేదా అసభ్యకర సంఘటనలు చోటు చేసుకో కుండా జాగ్రత్తలు తీసుకుంటానని అందువల్లనే ఇప్పటివరకు తన కెరియర్లో తన ముందు తప్పు జరిగితే అసలు ఊరుకోలేదని స్పష్టం చేసింది.

ఇక తాను డాన్స్ సంబంధిత కోర్సులలో డిప్లమో కూడా పూర్తి చేశానని ఆ తర్వాత ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో అవకాశాలు దక్కించుకుంటూ రాణించానని తెలిపింది.

అయితే తనకి 16 సంవత్సరాలున్న సమయంలో అవకాశం కోసం ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ దగ్గరికి వెళ్లానని, దీంతో అతడు తనని కమిట్మెంట్ అడిగాడని అంతేగాక తాను చెప్పినట్లు చేస్తే సినిమా పరిశ్రమలో తిరుగులేని కొరియోగ్రాఫర్ ని చేస్తానంటూ ఆశ కూడా చూపించాడని, కానీ తాను మాత్రం అవకాశాల కోసం ఎలాంటి అడ్డదారులు తొక్కి లేదని స్పష్టం చేసింది.

తనని కమిట్మెంట్ అడిగిన ఆ ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ మరణించాడని దాంతో అతడి పేరు చెప్పడానికి స్వర్ణ మాస్టర్ నిరాకరించింది.

అలాగే ఈ సంఘటన ఎదుర్కొన్న తర్వాత శివ శంకర్ మాస్టర్ తనని చాలా జాగ్రత్తగా చూసుకున్నాడని అందువల్లే ఇంతకాలం వరకూ కొనసాగుతున్నానని చెప్పుకొచ్చింది.

ఇక మీదట మహేష్ బాబు స్పెషల్ క్యారెక్టర్స్ చేయబోతున్నారా..?

ఇక మీదట మహేష్ బాబు స్పెషల్ క్యారెక్టర్స్ చేయబోతున్నారా..?