సీఎం కేసీఆర్ ప్రకటనపై దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు..!!

నిండు అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ లక్షకు పైగా ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రకటన చేయటం రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది.

కొత్తగా 91,147 స్థానాలు ఖాళీగా ఉండగా.వాటిలో 80,039 స్థానాలకు నేడే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నట్లు.

కేసీఆర్ తెలియజేయడం మరింత ఆనందాన్ని నిరుద్యోగులలో కలిగించింది.కేసీఆర్ ప్రకటనతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాల వద్ద సంబరాలు అంబరాన్ని అంటాయి.

ఈ నేపథ్యంలో దానం నాగేందర్ కేసీఆర్ ప్రకటనపై అదిరిపోయే డైలాగులు వేశారు.నిజంగా ఈ రోజు మార్చి తొమ్మది అనేది చారిత్రాత్మకమైన రోజు అని.

నిరుద్యోగులకు పండగ దినం అని స్పష్టం చేశారు.ఉద్యోగాలకు సంబంధించి న్యాయస్థానం అదే విధంగా కేంద్ర ప్రభుత్వం వద్ద అనేక సమస్యలు ఏర్పడిన క్రమంలో సీఎం కేసీఆర్ చాలా జాగ్రత్తగా డీల్ చేసి.

ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన చేశారు అని దానం నాగేందర్ స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎప్పటినుండో నిరీక్షణతో వేచి ఉండగా నేడు వారికి కేసీఆర్ ప్రకటన ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు.

ఇక ఇదే విధంగా నిరాశతో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం కూడా చాలా సంతోషం అంటూ.

ఇది నిజంగా పండుగ దినమని దానం నాగేందర్ కేసీఆర్ ప్రకటనపై తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.

ఉదయం పాలల్లో ఇవి కలిపి తీసుకుంటే మీ ఆరోగ్యానికి తిరుగే ఉండదు!