బహుజన సేన ఆధ్వర్యంలో దామోదరం సంజీవయ్య 104వ జయంతి వేడుకలు
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బహుజన సేన రాజన్న సిరిసిల్ల ఆర్గనైజేషన్ కార్యాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 104 వ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి, జిల్లా కేంద్రంలో ఉన్న దామోదరం సంజీవయ్య విగ్రహాం వద్ద జయంతి వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా బహుజన సేన రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్గనైజేషన్ అధ్యక్షులు జింక శ్రీధర్ మాట్లాడుతూ అణిచివేయబడిన వర్గంలో పుట్టిన దామోదరం సంజీవయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా వారు చేసిన సేవలు మరువలేనివని అన్నారు.
దామోదరం సంజీవయ్య ఎదిగిన విధానాన్ని నేటి యువ సమాజం ఆదర్శంగా తీసుకొని సామాజిక సమానత్వాన్ని, జ్ఞానవంతమైన సమాజ నిర్మాణం కొరకు యువత పెద్ద ఎత్తున ముందుకు రావాలని కోరారు.
వేములవాడ పట్టణంలో దామోదరం సంజీవయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వన్ని కోరుతూ, భవిష్యత్ తరాలకు మహనీయుల స్ఫూర్తిని విగ్రహాల రూపకంగా అందించగలమని అన్నారు.
ఈ కార్యక్రమంలో సంజీవయ్య నగర్ యువజన సంఘం అధ్యక్షులు కొంపెల్లి విజయ్ కుమార్, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు రెడ్డిమల్ల భాను, ప్రజా సంఘాల నాయకులు పెరుమండ్ల సంతోష్, సిరిగిరి రమేష్, పెరుమండ్ల శ్రీకాంత్, లక్కే సాగర్, నేదూరి రాజు, అలువాల రాము, పొత్తూరి మనోహర్ తదితరులు పాల్గొన్నారు.