ఆ రీజన్ వల్లే నాకు పెళ్లి కాలేదు.. సహజీవనం చేస్తా.. దామిని షాకింగ్ కామెంట్స్ వైరల్!
TeluguStop.com
బిగ్ బాస్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న కంటెస్టెంట్లలో దామిని( Damini ) ఒకరు.
బిగ్ బాస్ హౌస్ లో వంటలక్కగా పేరు సంపాదించుకున్న దామిని తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.
నేను వెజిటేరియన్ అని కాకపోతే గుడ్డు తింటానని ఆమె అన్నారు.బాహుబలి సినిమా( Baahubali )లో పచ్చబొట్టేసినా పాటను నేను పాడానని ఆమె తెలిపారు.
నా శరీరంపై మాత్రం ఇప్పటివరకు ఒక్క పచ్చబొట్టుకూడా లేదని దామిని అన్నారు.ఏదైనా స్పెషల్ మూవ్ మెంట్ ఉంటే మాత్రమే ఆ పని చేస్తానని దామిని వెల్లడించారు.
నాకు లవ్ మ్యారేజ్ అంటే ఇష్టమని కొన్నిరోజులు డేటింగ్ చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటే బాగుంటుందనేది నా ఒపీనియన్ అని ఆమె చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం సహజీవనం చేయడంలో ఎలాంటి తప్పు లేదని దామిని అన్నారు. """/" /
సహజీవనం చేయాల్సి వస్తే కుటుంబ సభ్యుల అనుమతి కచ్చితంగా తీసుకుంటానని దామిని పేర్కొన్నారు.
అమ్మానాన్న నన్ను చాలా అర్థం చేసుకుంటారని అందుకే పెళ్లి చేసుకోలేదని దామిని కామెంట్లు చేశారు.
మా ఇంట్లో చికెన్ తీసుకురారని బిగ్ బాస్ హౌస్ లో నేను చికెన్ కూర వండానని దామిని కామెంట్లు చేశారు.
అది చూపించలేదని దామిని కామెంట్లు చేశారు. """/" /
పేడ కొట్టిన తర్వాత ప్రిన్స్ యావర్( Prince Yawar ) కు సారీ చెప్పి తలంటు పోశానని అది కూడా చూపించలేదని దామిని అన్నారు.
బిగ్ బాస్ షోకు సంబంధించి కొన్ని ప్రసారం చేయకపోవడం వల్ల నాపై వ్యతిరేకత వచ్చిందని ఆమె కామెంట్లు చేశారు.
దామిని వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.దామిని బాట్ల కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
బిగ్ బాస్ హౌస్ లో దామిని రీఎంట్రీ ఇస్తారని జోరుగా ప్రచారం జరుగుతుండటం గమనార్హం.
ఇక జుట్టు ఎంత పల్చగా ఉన్న నో వర్రీ.. ఈ సీరం తో దట్టంగా మార్చుకోండి!