పవన్ కు తెలంగాణల డ్యామేజ్ తప్పదా ?

పవన్ కల్యాణ్( Pawan Kalyan ) తెలంగాణ ఎన్నికల్లో పోటీకి సై అని తప్పు చేస్తున్నారా ? ఆయనకు తెలంగాణలో డ్యామేజ్ తప్పదా ? తెలంగాణ ప్రజలు పవన్ ను లైట్ తీసుకున్నారా ? అంటే అవుననే అభిప్రాయాలూ వ్యక్తమౌతున్నాయి.

పార్టీ స్థాపించినది మొదలుకొని కేవలం ఆంద్రపైనే ఫోకస్ పెడుతూ వచ్చారు పవన్.పవన్ కల్యాణ్ తెలంగాణ ఎన్నికల్లో పోటీకి సై అని తప్పు చేస్తున్నారా ? ఆయనకు తెలంగాణలో డ్యామేజ్ తప్పదా ? తెలంగాణ ప్రజలు పవన్ ను లైట్ తీసుకున్నారా ? అంటే అవుననే అభిప్రాయాలూ వ్యక్తమౌతున్నాయి.

పార్టీ స్థాపించినది మొదలుకొని కేవలం ఆంధ్రపైనే ఫోకస్ పెడుతూ వచ్చారు పవన్. """/" / కానీ ఈసారి అనూహ్యంగా తెలంగాణపై కూడా దృష్టి సారించారు.

అయితే తెలంగాణ ఎన్నికలను మొదట లైట్ తీసుకున్నప్పటికి బీజేపీ ఒత్తిడి కారణంగా పోటీ చేయక తప్పలేదు.

ప్రస్తుతం బీజేపీతో కలిసి జనసేన పార్టీని( Janasena Party ) ఏడు స్థానాల్లో బరిలో దించారు పవన్.

ఎన్నికలకు కేవలం వారం రోజులు మాత్రమే సమయం ఉండడంతో ప్రస్తుతం తెలంగాణలో ప్రచారంపై దృష్టి కేంద్రీకరించారు.

అయితే పవన్ ప్రచారాలకు ఆంధ్రలో లభించిన మద్దతు తెలంగాణలో లభించడంలేదు.ఆయన ప్రసంగాల్లో కూడా ఏపీలో ఉన్నంత పస తెలంగాణలో కనిపించడం లేదని టాక్.

ఏదో నామమాత్రంగానే ఆయన వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. """/" / తెలంగాణ ప్రజలు కూడా పవన్ పట్ల అదే వైఖరితో ఉన్నట్లు తెలుస్తోంది.

సినీ నటుడిగా రెండు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉన్నప్పటికి రాజకీయ నాయకుడిగా తెలంగాణ ప్రజలు ఆయనను గుర్తించడం లేదని తెలుస్తోంది.

పైగా తెలంగాణలో తీవ్ర అన్యాయం చేసిన బీజేపీతో( BJP ) జట్టు కట్టడంతో ఆయనను ప్రజలు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.

తెలంగాణలో పవన్ పార్టీకి ఏమాత్రం ఓటు శాతం నమోదు కాకపోయిన ఆ ప్రభావం ఏపీ జనసేనపై పడే అవకాశం ఉంది.

ఎందుకంటే తెలంగాణ ఎన్నికలు పూర్తయిన మూడు నెలల్లో ఏపీలో కూడా ఎన్నికలు జరగనున్నాయి.

ఈసారి ఏపీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పవన్ అధికారం తనదేనని ధీమాగా ఉన్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణలో ఫలితాలు జనసేనకు ప్రతికూలంగా మారితే.పవన్ కు డ్యామేజ్ తప్పదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరి ఏం జరుగుతుందో చూడాలి.

సినిమాలు వేల కోట్లు సాధిస్తున్నా ఏ మాత్రం గర్వం లేని హీరో ప్రభాస్.. గొప్పోడంటూ?