వైసీపీ పాలనలో దళితులు ఆనందంగా లేరా.. కోనసీమ అల్లర్లకు కారణం అదేనా

ఏపీలో కులాల కుంపట్ల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.ఏపీలో ఉన్న కుల జాడ్యం తెలంగాణలో కనిపించదని చాలా మంది చెబుతారు.

ఇక కోనసీమ విషయానికి వస్తే ఈ కులాల కంపు మరింత ఎక్కువగా కనబడుతోంది.

అక్కడ వ్యక్తులకు కనబడ్డ క్షణాల్లోనే కులం గురించి అడిగేస్తారని చాలా మంది చెబుతారు.

కోనసీమను ప్రశాంతతకు మారుపేరుగా చూస్తారు.అటువంటి కోనసీమలో మొన్న జరిగిన విధ్వంసం గురించి ఎవరూ ఊహించనిది.

కోనసీమ ప్రజలు ఇలా విధ్వంసాలకు తెగ బడతారని ఎవరూ నమ్మలేదు.కానీ విధ్వంసం చేసేశారు.

ఓ మంత్రి ఇంటితో పాటుగా ఎమ్మెల్యే ఇంటికి కూడా కోనసీమ వాసులు నిప్పు పెట్టారు.

జిల్లా పేరు విషయంలో రగులుకున్న జ్వాల ఇళ్లు కాలబెట్టే వరకు వెళ్లింది.దీంతో అందరూ షాక్ అయ్యారు.

ఏంటి కోనసీమ వాసులు ఇలా కూడా చేస్తారా అని ఆశ్చర్యపోతున్నారు.ఇలా కోనసీమ వాసులు రెచ్చిపోవడానికి కారణం మీరంటే మీరని అధికార, ప్రతిపక్షాలు మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి.

కొంత మంది మాత్రం వైసీపీ ప్రభుత్వంలో దళితులు ఆనందంగా లేరని అందుకోసమే ఈ రగడ జరిగిందని చెబుతున్నారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులకు వర్తింపజేయాల్సిన అనేక పథకాలను నిలిపివేసిందని దాంతోనే దళితులు గుర్రుగా ఉన్నారని అంటున్నారు.

అంబేడ్కర్ విదేశీ విద్య పథకం కోసం ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదని అందుకోసమే దళితులు ఇలా చేస్తున్నారని అంటున్నారు.

అనేక పథకాలను నిలిపివేయడం మాత్రమే కాకుండా దళితుల మీద కూడా దాడులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయని చెబుతున్నారు.

అంబేడ్కర్ పేరును కోనసీమ జిల్లాకు పెట్టడం వెనుక రాజకీయ ఉద్దేశం ఉందని పలువురు చెబుతున్నారు.

దళితుల దృష్టిని మరల్చేందుకే ఇలా దళిత నాయకుడైన అంబేడ్కర్ పేరును కోనసీమ జిల్లాకు పెట్టారని ఇందులో ప్రభుత్వం రాజకీయంగా లబ్ధి పొందేందుకు చూసిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఇందువల్లే పచ్చగా ఉన్న కోనసీమ ఇలా రగులుకుందని అంటున్నారు.

KTR : ఢిల్లీకి యాత్రలు తప్పితే రేవంత్ చేసిందేమీ లేదు..: కేటీఆర్