దళిత బంధును బీఆర్ఎస్ కార్యకర్తలకే పరిమితం చేయరాదు: నూనె వెంకట్ స్వామి

నల్లగొండ జిల్లా: అర్హులందరికీ దళిత బంధు ఇస్తే బీఆర్ఎస్( BRS ) లో తిరిగే వారికే పరిమితం చేయాల్సిన అవసరం ఉండదని,చిత్తశుధ్ధి ఉంటే నిధులను విడుదల చేయాలని ప్రజాపోరాట సమితి (పిఆర్ పిఎస్) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి( Venkat Swamy ) అన్నారు.

బుధవారం చిట్యాలలోని పిఆర్ పిఎస్ ఆఫీస్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక్క చిట్యాల మున్సిపాలిటీలో దళిత బంధు పధకానికి 500 దళిత కుటుంబాలు అర్హత కలిగి ఉన్నాయని,మండల వ్యాప్తంగా మొత్తం 2000 దళిత కుటుంబాలు ఉన్నాయని వీరందరికీ దళిత బంధు అమలు చేస్తే 200 కోట్లు మాత్రమే వెచ్చించాలని,నల్లగొండ జిల్లాలోని అర్హులైన దళిత కుటుంబాలన్నిటికీ పధకాన్ని వర్తింప చేయాలంటే 10 వేల కోట్లు మాత్రమే కేటాయిస్తే సరిపోతుందన్నారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు నాగిళ్ళ యాదయ్య,గాదె శ్రీహరి,బర్రె సంజీవ, రెడపాక లక్ష్మి,పందుల మహేశ్,మేడి రామలింగయ్య,యకాల రమేష్,పోకల అరుణ్ కుమార్,గద్దపాటి రామలింగయ్య,పెండ్యాల శ్రవణ్ కుమార్,నకిరెకంటి సతీష్,జిట్ట స్వామి, వర్కాల సైదులు,దేశపాక శ్రీరాములు,సైదులు తదితరులు పాల్గొన్నారు.

DOGE నుంచి తప్పుకోవడంపై వివేక్ రామస్వామి స్పందన .. మస్క్‌‌పై షాకింగ్ కామెంట్స్