డాకు మహారాజ్ మూవీ 50 డేస్ సెంటర్ల లెక్క ఇదే.. బాలయ్య ఖాతాలో జెన్యూన్ రికార్డ్!
TeluguStop.com
టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) క్రేజ్ పరంగా ఒకింత టాప్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే.
డాకు మహారాజ్ సినిమాతో బాలయ్య ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరింది.
ఈ సినిమా ఇప్పటికే విడుదలై 50 రోజులు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.
డాకు మహారాజ్( Daku Maharaj ) థియేట్రికల్ హక్కులు 80 కోట్ల రూపాయలకు అమ్ముడవగా ఈ సినిమాకు ఏకంగా 95 కోట్ల రూపాయల( 95 Crore Rupees ) షేర్ కలెక్షన్లు వచ్చాయి.
డాకు మహారాజ్ మూవీ గ్రాస్ కలెక్షన్లు 190 కోట్ల రూపాయల రేంజ్ లో ఉన్నాయి.
ప్రగ్యా జైస్వాల్( Pragya Jaiswal ).శ్రద్ధా శ్రీనాథ్ ( Shraddha Srinath )ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించినా ఈ సినిమా ఈ ఇద్దరు హీరోయిన్లకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
ఊర్వశి రౌతేలా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించగా తన నటనతో ఆమె మెప్పించారనే సంగతి తెలిసిందే.
ఊర్వశి రౌతేలా డాకు మహారాజ్ కోసం ఏకంగా 3 కోట్ల రూపాయలు పారితోషికంగా అందుకున్నారని వార్తలు వచ్చాయి.
"""/" /
విజయవాడ, కడప, హిందూపూర్, ఆదోని, గుంతకల్, చిలకలూరిపేట, తెనాలి, ఒంగోల్, అమలాపురం, బెంగళూరులలో ఈ సినిమా 50 రోజులు ఆడింది.
ఓటీటీలో అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా ఇన్ని థియేటర్లలో డాకు మహారాజ్ 50 రోజులు ఆడటం అంటే రికార్డ్ అనే చెప్పాలి.
రాయలసీమలోని 4 సెంటర్లలో ఈ సినిమా 50 రోజులు ఆడటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.
"""/" /
సీడెడ్ ఏరియా బాలయ్య అడ్డా అని కూడా సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
డాకు మహారాజ్ సినిమాతో బాలయ్య ఖాతాలో నాలుగో హిట్ చేరింది.కూతురు తేజస్విని ఇస్తున్న సలహాలు, సూచనలు బాలయ్యకు ఒక విధంగా ప్లస్ అయ్యాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు.
బాలయ్య పారితోషికం ప్రస్తుతం 38 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.బాలయ్య తన సినిమాలతో బాక్సాఫీస్ లెక్కల్ని మార్చేస్తున్నారు.