కుప్పలు తెప్పలుగా లాటరీ టికెట్లు కొన్నాడు.. తీరా గెలిచింది ఎంతంటే?

లాటరీలో కోట్లు, లక్షల్లో డబ్బులు గెలిచారనే వార్తలు మనం చాలా విని ఉంచాం.

కానీ లాటరీ టికెట్లు కొనేందుకు కోట్లు ఖర్చు చేసిన వారు ఉన్నారంటే నిజంగా ఆశ్చర్యపోవాల్సిన విషయం.

అయితే అలాంటి ఓ వ్యక్తి గురించే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నారం.కేరళలోని కన్నౌర్ కు చెందిన రాఘవన్ 52 ఏళ్లుగా లాటరీ టికెట్లు కొంటూనే ఉన్నాడు.

రోజుకు పది లాటరీ టికెట్ల చొప్పున కొంటూనే ఉండేవాడు.రోజంతా కష్టపడి సంపాదించిన డబ్బునంతా వీటిలోనే పెట్టిన రోజులు కోకొల్లలు.

అయితే మొత్తం తన జీవితంలో 3 కోట్ల 50 లక్షల రూపాయలను లాటరీ టికెట్లు కొనేందుకే ఖర్చు చేశాడట.

ఇంతా చేసినా అతను గెలుచుకున్న గరిష్ట బహుమతి మాత్రం 5 వేల రూపాయలు మాత్రమే.

పాపం దరిద్ర లక్ష్మి ఈయన చుట్టే ఉందేమో అనిపిస్తోంది కదా ఈ వార్త వింటుంటే.

మధ్య తరగతి కుటుంబానికి చెందిన రాఘవన్ లాటరీల కోసం అంత డబ్బు ఖర్చు చేసి ఏం గెలుచుకోక పోయినప్పటికీ.

వాటిని కొనడం మాత్రం ఆపే పరిస్థితే లేదని తెగేసి చెప్తున్నాడు.వెర్రి వేయి రకాలని చెప్తుంటారు కదా.

అందులో ఇదో రకమేమో మరి.తన మొట్ట మొదటి లాటరీ టికెట్ ను 1970లో తన 18 ఏళ్ల వయసులో కొనుగోలు చేసినట్లు చెబుతున్నాడు రాఘవన్.

తన జీవితం ముగిసేలోపు ఒక్కసారి అయినా అదృష్టం కలిసి వస్తుందని అతను గట్టిగా నమ్ముతున్నాడు.

మరి చూడాలి.వీరికి అదృష్టం ఎంత ఉందో.

Vizianagaram District : విజయనగరం జిల్లా చీపురుపల్లిలో టీడీపీ కార్యకర్తల ఆందోళన