మీకు తెలుసా : తరచూ శృంగారం చేస్తే ఆ సమస్యలు రావంట…
TeluguStop.com
మానవ జీవితంలో శృంగారం అనేది ఎంతో కీలకమైన అంశం.ఈ శృంగారం అనేది ఒక శారీరక సంతృప్తిని మాత్రమే కాక మానసిక సంతృప్తితో పాటు మరో కొత్త జీవానికి కూడా నాంది పలుకుతుంది.
అంతేకాక ఈ శృంగారం వల్ల అనేకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఇప్పటికే పలువురు శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు.
అయితే ఇందులో భాగంగా ముఖ్యంగా తరచూ శృంగారం చేయడం వల్ల గుండె జబ్బులు దూరం అవుతాయని ఇప్పటికే వైద్య నిపుణులు అధికారికంగా నిరూపించారు కూడా.
అలాగే నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లు వంటి వారు కూడా శృంగారంలో పాల్గొన్న తర్వాత ప్రశాంతంగా నిద్ర పోతున్నారని ప్రయోగాత్మకంగా వైద్యులు నిరూపించారు.
అయితే ఈ శృంగారం వల్ల మానసిక ఒత్తిడులు మరియు రుగ్మతలు కూడా తొలగిపోతాయి.
తరచూ శృంగారంలో పాల్గొనే వారు డైట్ చక్కగా పాటిస్తే బరువు, బిపి మీ షుగర్ వంటి వాటిని అదుపులో ఉంచుకోవచ్చు.
అలాగే తరుచూ తన ప్రియురాలు లేదా భార్య ను చుంబించడం ద్వారా వ్యాయామం చేసినట్లే అంటున్నారు మరికొందరు వైద్య నిపుణులు.
అయితే ఈ శృంగారం మితిమీరితే నష్టాలు కూడా చాలానే ఉన్నాయని అంటున్నారు వైద్య నిపుణులు.
ఇందులో ముఖ్యంగా తమ జీవిత భాగస్వామితో తప్ప మరే ఇతరులతో శృంగారంలో పాల్గొంటే వివిధ రోగాలు బారిన పడతారు.
అంతేకాక అక్రమ సంబంధాల కారణంగా తమ జీవితంలో లేనిపోని కష్టాలు మరియు అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కాబట్టి తమ జీవిత భాగస్వామితో మంచి సంబంధం కలిగి ఉంటె ఆరోగ్యంగానూ సంతోషకరమైన జీవితం ఆస్వాదించవచ్చని పలువురు శృంగార వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
నన్ను వెంటాడే ఎమోషన్ నువ్వు… ఆసక్తికర పోస్ట్ చేసిన ఎన్టీఆర్!