రోజూ ఈ ఆయిల్‌తో మ‌సాజ్ చేసుకుంటే ముడ‌తలు ద‌రి దాపుల్లోకి కూడా రావు!

ముడ‌త‌లు.వ‌య‌సు పైబ‌డిన వారిలోనే ఇవి క‌నిపిస్తాయి అని అనుకుంటే పొర‌పాటే.

ఎందుకంటే, ప్ర‌స్తుత కాలంలో పాతిక‌, ముప్పై ఏళ్ల వారు సైతం ముడ‌త‌ల స‌మ‌స్య‌ను ఫేస్ చేస్తున్నారు.

ధూమపానం, మ‌ద్య‌పానం, ఎండ‌ల్లో అధికంగా తిర‌గ‌డం, ప‌లు రకాల మందుల వాడ‌కం, ఆహార‌పు అల‌వాట్లు, వాతావ‌ర‌ణ కాలుష్యం, శ‌రీరానికి స‌రిప‌డా నీటిని అందించ‌కపోవ‌డం, స‌న్ స్క్రీన్‌ను ఎవైడ్ చేయ‌డం, నిద్ర‌ను నిర్ల‌క్ష్యం చేయ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం అవుతుంది.

దాంతో చిన్న వ‌య‌సులోనే ముడ‌త‌ల స‌మ‌స్య వేధిస్తూ ఉంటుంది.ఏదేమైనా ముడ‌త‌లు వ‌చ్చాక‌, వాటిని త‌గ్గించుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తూ తిప్ప‌లు ప‌డేకంటే.

రాకుండా ముందు జాగ్ర‌త్తలు తీసుకోవ‌డం ఎంతో ఉత్తమం.అయితే అందుకు ఇప్పుడు చెప్ప‌బోయే ఆయిల్ గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

ఈ ఆయిల్‌తో రోజూ మ‌సాజ్ చేసుకుంటే.అర‌వై ఏళ్లు వ‌చ్చినా యంగ్‌గానే క‌నిపిస్తారు.

మ‌రి లేటెందుకు ఆ ఆయిల్‌ను ఎలా త‌యారు చేసుకోవాలో చూసేయండి.ముందుగా ఒక ఆరెంజ్‌, ఒక లెమ‌న్ ల‌ను తీసుకుని నీటిలో శుభ్రంగా క‌డిగి.

వాటికి ఉన్న తొక్క‌ల‌ను వేరు చేయాలి.అలాగే రెండు నాటు గులాబీల‌ను తీసుకుని రేక‌ల‌ను తుంచి పెట్టుకోవాలి.

ఆ త‌ర్వాత‌ బ్లెండ‌ర్ తీసుకుని అందులో ఆరెంజ్ మ‌రియు లెమ‌న్ తొక్క‌లు, గులాబీ రేక‌లు వేసి గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు గ్లాస్ జార్‌ను తీసుకుని అందులో ఒక క‌ప్పు కొబ్బ‌రి నూనె, గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్ర‌మం వేసి బాగా క‌ల‌పాలి.

"""/"/ ఆపై మూత పెట్టిన గ్లాస్ జార్‌ను మ‌రుగుతున్న నీటిలో పావు గంట పాటు ఉంచి.

డ‌బుల్ బాయిల‌ర్ మెథ‌డ్‌లో హీట్ చేయాలి.ఇలా హీట్ చేసుకున్న ఆయిల్‌ను చ‌ల్ల‌బ‌డిన త‌రువాత స్ట్రైన‌ర్ సాయంతో స‌ప‌రేట్ చేసుకుని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవాలి.

స్నానం చేయ‌డానికి గంట ముందు ఈ ఆయిల్‌ను ముఖానికి, మెడ‌కు కావాల‌నుకుంటే చేతుల‌కు అప్లై చేసుకుని మ‌సాజ్ చేసుకోవాలి.

రోజు ఈ విధంగా చేస్తే ముడ‌త‌లు ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.అదే సమ‌యంలో మీ చ‌ర్మం య‌వ్వ‌నంగా మెరుస్తూ కూడా ఉంటుంది.

నేటి ఎన్నికల ప్రచారం : కడప లో షర్మిల .. జగన్ ఎక్కడంటే ?