దగ్గుబాటి అభిరామ్ పెళ్లి తేదీ ఫిక్స్.. వధువు బ్యాగ్రౌండ్ తెలిస్తే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే!
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ సాధించాలంటే టాలెంట్ తో పాటు లక్ కూడా ఉండాలి.
భారీ బ్యాగ్రౌండ్ ఉన్నా లక్ లేకపోవడంతో దగ్గుబాటి అభిరామ్ కెరీర్ పరంగా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించే విషయంలో ఫెయిల్ అవుతున్నారు.
తేజ డైరెక్షన్( Teja ) లో తెరకెక్కిన అహింస సినిమాలో లుక్స్ విషయంలో, నటన విషయంలో దగ్గుబాటి అభిరామ్ ( Daggubati Abhiram )విమర్శలు ఎదుర్కొన్నారు.
అభిరామ్ ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వ్యాపారాలపై దృష్టి పెడుతున్నారు. """/" /
అయితే దగ్గుబాటి అభిరామ్ పెళ్లి తేదీ ఫిక్స్ అయిందని ఈ ఏడాదే శ్రీలంకలో అభిరామ్ పెళ్లి గ్రాండ్ గా జరగనుందని సమాచారం అందుతోంది.
దగ్గుబాటి ఇంట పెళ్లి సందడి అంటే ఆ వార్త అభిమానులకు సైతం ఏ స్థాయిలో సంతోషాన్ని కలిగిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
సురేష్ బాబు( Daggubati Suresh Babu ) చెల్లెలి కూతురుతో అభిరామ్ జీవితాన్ని పంచుకోనున్నారని తెలుస్తోంది.
వధువు కుటుంబానికి వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
"""/" /
వధువు కుటుంబం కారంచేడులో నివశిస్తోందని పెళ్లికూతురు ఉన్నత చదువులు చదవిందని సమాచారం.
ఈ పెళ్లితో రామానాయుడు( D.Rama Naidu ) కోరిక కూడా తీరనుందని తెలుస్తోంది.
వధువు కుటుంబానికి పొలాలతో పాటు పలు వ్యాపారాలు కూడా ఉన్నాయని సమాచారం.డిసెంబర్ నెల 6వ తేదీన గ్రాండ్ గా ఈ పెళ్లి జరగనుంది.
రామానాయుడు నివశించిన పాత ఇల్లు డిజైన్ ను శుభలేఖలపై అచ్చేయిస్తున్నారని సమాచారం.అభిరామ్ కు ఆ అమ్మాయి అంటే చిన్నప్పటి నుంచి ఇష్టమని తెలుస్తోంది.
పెళ్లి తర్వాత అభిరామ్ కు కెరీర్ పరంగా కూడా కలిసొస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
అభిరామ్ పెళ్లి వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
స్టార్ డైరెక్టర్ డైరెక్షన్ లో అభిరామ్ నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
వైరల్: 20 సంచుల నిండా నాణేలతో కోర్టుకెళ్లిన వ్యక్తి… అందరూ షాక్!